Sugar Baby: తమన్నాతో పోటీపడుతున్న త్రిష...

ABN , Publish Date - May 22 , 2025 | 12:06 PM

మణిరత్నం గత చిత్రం 'పొన్నియన్ సెల్వన్'లోని పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రను 'థగ్ లైఫ్'లో చేస్తోంది త్రిష. తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్ చూస్తే ఆ విషయం అర్థమౌతోంది.

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'థగ్ లైఫ్' మూవీ కేవలం యాక్షన్ కే పరిమితం కాలేదనేది ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోతోంది. తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ చూడగానే ఇందులో కుర్రాళ్ళను కట్టిపడేసే సాంగ్స్ కూడా ఉంటాయనేది తెలిసొచ్చింది. ఆస్కార్ విజేత ఏ. ఆర్. రెహమాన్, మణిరత్నం కలిస్తే ఆ మ్యూజిక్ మ్యాజిక్ వేరే రకంగా ఉంటుంది. అది చాలా రోజుల తర్వాత 'థగ్ లైఫ్' మూవీలోని కనిపించింది.

ఆ మధ్య వచ్చిన 'థగ్ లైఫ్' మూవీ ట్రైలర్ ను చూసిన వారిలో కొందరు అందులోని కమల్, అభిరామి లిప్ లాక్ సీన్స్ చూసి 'ఈ వయసులో ఇదే పని' అని పెదవి విరిచారు. అలానే... కమల్, త్రిష మధ్య ఉన్న ఇంటిమెసీ సీన్స్ చూసి సమ్ థింగ్ ఫిష్ఫీ అనుకున్నారు. అనుకున్నంతా జరిగింది. లేటెస్ట్ గా వచ్చిన షుగర్ బేబీ సాంగ్ చూస్తుంటే... అందరూ ఊహించిన దానికంటే కాస్తంత ఎక్కువే ఈ సినిమాలో రొమాన్స్ ఉందనిపిస్తోంది. త్రిషపై చిత్రీకరించిన 'షుగర్ బేబీ' సాంగ్ ఈ మధ్యలో వచ్చిన ఆమె పాటల్లో బెస్ట్ అని నెటిజన్స్ అంటున్నారు. ఈ పాట ఇలా విడుదలైందో లేదో సోషల్ మీడియాలో త్రిష సోయగాలను కాప్చర్ చేసేసి... తమకు కావల్సిన రీతిలో పోస్ట్ చేసేసి సెగలు పుట్టించారు కుర్రకారు. త్రిష కూల్ గా వేసిన కొన్ని స్టెప్స్ చూస్తుంటే... తమన్నాకు తానేమీ తక్కువ కాదన్నట్టుగా ఉన్నాయి. తమన్నా స్థాయిలో ఎరోటిక్ స్టెప్స్ త్రిష వేయకపోయినా... తనదైన స్టైయిల్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.


మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాల్లోనూ త్రిష కీలక పాత్ర పోషించింది. ఆమె మీదనే ప్రధానమైన పాటలనూ మణిరత్నం చిత్రీకరించారు. ఆ సమయంలోనే త్రిషలోని సత్తాను గ్రహించినట్టున్నాడు మణిరత్నం. వెంటనే తన 'థగ్ లైఫ్'లోనూ ఛాన్స్ ఇచ్చాడు. త్రిష కూడా 'పొన్నియన్ సెల్వన్'కు పూర్తి భిన్నమైన పాత్రను ఈసారి ఇవ్వబోతున్నట్టు మణిరత్నం ముందే చెప్పారని తెలిపింది. అటు కమల్ హాసన్ తోనూ, ఇటు శింబుతోనూ త్రిష ఇప్పటికే నటించింది. సో... ఈ నలుగురు ఒకరికి ఒకరు సుపరిచితమే. అది ఈ పాట బాగా రావడానికి ఉపయోగపడింది. తాజాగా విడుదలైన 'షుగర్ బేబీ' పాటను తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా, అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ పాడారు.

ఇదిలా ఉంటే... ఇటీవల కొన్ని తమిళ చిత్రాలు ఉత్తరాదిన పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ లలో ప్రదర్శితం కాలేదు. ఓటీటీ అగ్రిమెంట్ తమకు అనుకూలంగా లేని కారణంగా ఆ సినిమాలను మల్టీప్లెక్స్ యాజమాన్యం ప్రదర్శించలేదు. అయితే 'థగ్ లైఫ్'కు ఆ సమస్య రాకుండా ఓటీటీ హక్కుల్ని తీసుకున్న నెట్ ఫ్లిక్స్ తో ఈ చిత్ర నిర్మాతలు మణిరత్నం, కమల్ హాసన్ సంప్రదింపులు చేసినట్టు తెలిసింది. థియేటర్ లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే తమ చిత్రం ఓటీటీలో వస్తుందని కమల్ హాసన్ తెలిపారు. సో... 'థగ్ లైఫ్' ఉత్తరాదిన పీవీఆర్ - ఐనాక్స్ లో కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 5న విడుదల చేస్తున్నారు.

Also Read: Aamir Khan: తగ్గేదే లే అంటున్న మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్...

Also Read: Pan India: రాజమౌళి, సుకుమార్... ఆ తర్వాత...

Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 22 , 2025 | 12:46 PM