Kothalavadi: నిర్మాతగా మారిన స్టార్ హీరో మదర్...

ABN , Publish Date - May 21 , 2025 | 04:05 PM

ప్రముఖ కథానాయకుడు యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా మారారు. పృథ్వీ అంబార్ దర్శకత్వంలో ఆమె 'కొత్తలవాడి' సినిమా నిర్మిస్తున్నారు.

సహజంగా ఏ తల్లి అయినా నిర్మాతగా మారారంటే... కొడుకును హీరోగా పెట్టి సినిమా తీస్తారు. కానీ పాన్ ఇండియా స్టార్, యశ్ (Yash) తల్లి పుష్ప అరుణ్ కుమార్ మాత్రం ఇందుకు భిన్నంగా నిర్మాతగా మారింది. కన్నడ చిత్రసీమలోని సుప్రసిద్థ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ (Raj Kumar), ఆయన భార్య పార్వతమ్మ (Pravathamma) స్ఫూర్తితో కొత్త బ్యానర్ ను ప్రారంభించి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా మారింది. ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం 'కొత్తలవాడి' (Kothalawadi). ఈ సినిమాలో పృథ్వీ అంబార్ (Prudhvi Ambar) హీరోగా నటిస్తున్నాడు. దీనికి సిరాజ్ రచన, దర్శకత్వం చేస్తున్నారు. గత నెలలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడులైంది. తాజాగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


కొత్తలవాడి అనేది కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకులో ఉన్న ఒక గ్రామం పేరు. అందుక‌నే ఇక్కడ చిత్రం ఎక్కువ భాగాన్ని చిత్రీక‌రించారు. సినిమా క‌థ‌కు సంబంధించిన స్థానికత, దాని మూలాలకు నిజమైన రీతిలో ఉండేలా బృందం స్థానిక యాసను కూడా సంభాష‌ణ‌ల్లో ఉప‌యోగించారు. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతూ మేక‌ర్స్ మే 21వ తేదీన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమా పాత్రల్లోని ఇన్‌టెన్సిటినీ తెలియ‌జేసేలా ఓ స‌రికొత్త ప్రపంచాన్ని ప‌రిచ‌యం చేసేలా ఉంది. మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ అందించిన సూప‌ర్బ్ విజువ‌ల్స్‌, అభినంద‌న్ కశ్యప్ కంపోజ్ చేసిన ప‌వ‌ర్‌ఫుల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయి. క‌థానాయ‌కుడు పృథ్వీ అంబ‌ర్ ర‌గ్డ్‌, ఎన‌ర్జిటిక్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 90 సెక‌న్ల పాటు ఉన్న ఈ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతోంది. ఈ చిత్రంలో గోపాల్ దేశ్‌పాండే, రాజేష్ న‌ట‌రంగ‌, అవినాష్‌, కావ్య శైవ‌, మ‌న్షి సుధీర్‌, ర‌ఘు ర‌మ‌ణ‌ కొప్ప, చేత‌న్ గంధ‌ర్వ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని పాటలకు వికాశ్‌ వశిష్ఠ స్వరాలు అందిస్తుంటే, అభినందన్ కశ్యప్ నేపథ్య సంగీతం ఇవ్వబోతున్నాడు. ర‌ఘు నీనంద‌ల్లి ఈ సినిమాకు మాట‌లు రాశారు. రామిశెట్టి ప‌వ‌న్ ఎడిట‌ర్‌, దినేష్ అశోక్ పోస్టర్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Also Read: Allu Arjun, Atlee Movie: ఫుల్‌స్వీంగ్‌లో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్...

Also Read: Seetharama Sastry: రామజోగయ్య శాస్త్రికి సిరివెన్నెల పురస్కారం

Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 21 , 2025 | 04:43 PM