Allu Arjun, Atlee Movie: ఫుల్‌స్వీంగ్‌లో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్...

ABN , Publish Date - May 21 , 2025 | 03:43 PM

అల్లు అర్జున్, అట్లీ కాంబినేసన్ లో రూపుదిద్దుకోబోతున్న అంతర్జాతీయ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. దానికి సంబంధించిన అప్ డేట్స్ ను బన్నీకి వివరించేందుకు అట్లీ హైదరాబాద్ చేరుకున్నారు.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), పాన్‌ ఇండియా సూపర్‌ డైరెక్టర్‌ అట్లీ (Atlee) కాంబోలో ఓ సెన్సేషనల్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబో కోసం భారతదేశ సినీ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులు ఎదురుచూశారు. ఈ సినిమాతో స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ ఫస్ట్‌ టైమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ (kalanithi Maran) నిర్మిస్తున్నారు. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్‌, హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌, డైరెక్టర్ అట్లీపై చిత్రీకరించిన ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ అనౌన్స్‌మెంట్‌ను చేసి అందరిని సంభ్రమశ్చర్యాలకు నిర్మాత కళానిధి మారన్ గురిచేశారు.


ఇదిలా ఉంటే... గత కొన్ని రోజులుగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ఫుల్‌ స్వీంగ్‌లో సాగుతోంది. ఈ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఐకాన్‌స్టార్‌ను కలిసి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ సంబంధించిన చర్చల్లో పాల్గొనబోతున్నారు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ A22 x A6 గా పిలవబడుతున్న ఈ చిత్రం, భారతీయ విలువలతో కూడిన కథనంతో ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Seetharama Sastry: రామజోగయ్య శాస్త్రికి సిరివెన్నెల పురస్కారం

Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్

Also Read: Mohanlal: క‌న్న‌ప్ప నుంచి.. కిరాత వ‌చ్చేశాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 21 , 2025 | 03:43 PM