NBK 111-Nayanatara: సామ్రాజ్యంలోకి రాణికి స్వాగతం.. నయన్ లుక్ అదిరింది..
ABN, Publish Date - Nov 18 , 2025 | 11:10 AM
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand malineni) ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘ ఇందులో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేశారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand malineni) ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే 111’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేశారు. మంగళవారం నయన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ సినిమాలో నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘సముద్రమంత ప్రశాంతతను, తుపాను అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది’ అంటూ వీడియో పంచుకున్నారు త్వరలోనే ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని వెల్లడించింది. నవంబర్ 26న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
ALSO READ: NBK 111-Nayanatara: సామ్రాజ్యంలోకి రాణికి స్వాగతం.. నయన్ లుక్ అదిరింది..
Bose Venkat: నటీనటులను హేళన చేయడం భావ్యం కాదు
Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న.. వారణాసి బ్యూటీ
Ram Pothineni: భాగ్యశ్రీతో ప్రేమ.. అదేంటి రామ్ అంత మాట అన్నాడు