Bose Venkat: నటీనటులను హేళన చేయడం భావ్యం కాదు

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:53 AM

నటీనటులు ప్రజల ఆస్తి అని, ప్రజల కోసమే వారు ఆడిపాడుతున్నారని, అలాంటి వారిని హేళనచేస్తూ మాట్లాడటం భావ్యం కాదని ప్రముఖ నటుడు, దర్శకుడు బోస్‌ వెంకట్‌ అన్నారు.

నటీనటులు ప్రజల ఆస్తి అని, ప్రజల కోసమే వారు ఆడిపాడుతున్నారని, అలాంటి వారిని హేళనచేస్తూ మాట్లాడటం భావ్యం కాదని ప్రముఖ నటుడు, దర్శకుడు బోస్‌ వెంకట్‌ (Bose venkat) అన్నారు. ఇటీవల కాలంలో నటీనటులకు జరుగుతున్న అవమానాలపై ఆయన మాట్లాడుతూ, ‘నటీనటులను ప్రశ్నించే వారు ఎవరైనా కావొచ్చు. వారిపై ఎల్లవేళలా ఓ కన్ను ఉంటుంది. నటీనటులను కించపరిచేలా మాట్లాడినా? ప్రశ్నించినా? మీడియాకే నష్టం. మేం ఆడిపాడేది మీ కోసమే. అందువల్ల నటీనటులను హేళన చేస్తూ మాట్లాడం మానుకోవాలి. నడిగర్‌ సంఘం భవన నిర్మాణ పనులు చాలా మేరకు పూర్తయ్యాయి. వచ్చే యేడాది ఒక అద్భుత భవన ప్రారంభోత్సవ వేడుక ఉంటుంది. రాజకీయాలు అనేది ప్రజలకు సేవ చేయడం. ప్రజా సేవ కోసం ఫలాన శాఖకు చెందిన వారే రావాలన్న నియమం లేదు. అయితే, నిజమైన సేవా గుణంతో రాజకీయాల్లోకి వస్తున్నారా? అనేది ప్రధాన ప్రశ్న. రాజకీయాల్లోకి వచ్చే వారి అనుభవం ఏంటి? వారికి ప్రజా సమస్యలపై ఉన్న అవగాహన, సత్సంబంధాలు,  ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఇత్యాది విషయాలు ఎంతో ముఖ్యం. బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఒక్క తమిళంలోనే  కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమవుతోంది. ఇది సంస్కృతిని నాశనం చేస్తోంది. సో.. ఇలాంటి షోలపై నిషేధం విధించడంలో తప్పులేదు. మనకంటూ ఓ సంస్కృతి సంప్రదాయాలున్నాయి. కానీ, టీవీలో ప్రసారమయ్యే వాటికి సెన్సార్‌ లేదు. సో... మనమే హద్దుల్లో ఉండటం మంచిది’ అని పేర్కొన్నారు.

ALSO READ: NBK 111-Nayanatara: సామ్రాజ్యంలోకి రాణికి స్వాగతం.. నయన్‌ లుక్‌ అదిరింది..

Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న.. వారణాసి బ్యూటీ

Ram Pothineni: భాగ్యశ్రీతో ప్రేమ.. అదేంటి రామ్ అంత మాట అన్నాడు

Updated Date - Nov 18 , 2025 | 12:49 PM