Aamir Khan: తగ్గేదే లే అంటున్న మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్...
ABN , Publish Date - May 22 , 2025 | 11:15 AM
మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ చేతిలో ఇప్పుడు దాదాపు ఆరు సినిమాలు వున్నాయి. ఇందులో కొన్నింటికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరికొన్ని చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.
మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) తగ్గేదే లే అంటున్నాడు. సినిమా ఎంపికలో ఎప్పుడూ ఆచితూచి అడుగులు వేసే ఆమీర్ ఇప్పుడు ఏకంగా ఐదారు సినిమాలను లైన్ లో పెట్టేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమా తర్వాత ఒకటి చేయడానికే ఎప్పుడూ ఆమీర్ ఇష్టపడుతుంటాడు. కొన్ని సినిమాల నిర్మాణ బాధ్యతలను కూడా తన భుజానికి ఎత్తుకోవడంతో నటనకు కొన్ని సార్లు దూరంగానూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) మూవీలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఇది అతని ఓన్ ప్రొడక్షన్. ఈ సినిమా జూన్ 20న జనం ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే... సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) లీడ్ క్యారెక్టర్ చేయబోతున్న ఓ మూవీలో ఆమీర్ ఖాన్ ను కీ-రోల్ చేయమని కోరుతున్నాడు 'డ్రీమ్ గర్ల్' (Dream Girl) ఫేమ్ రాజ్ శాండిల్య. అయితే కథ వినడానికి మరికొంత సమయాన్ని కోరాడు ఆమీర్ ఖాన్. ఒకసారి 'సితారే జమీన్ పర్' విడుదలైపోయిన తర్వాత ఈ కథను విని, పాత్ర నచ్చితే అందులో ఆమీర్ నటించే ఆస్కారం ఉంటుంది. ఆమీర్ ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలవుతుంది. వినోదం ప్రధానంగా సాగే థ్రిల్లర్ మూవీ ఇదని తెలుస్తోంది. దీనిని మహవీర్ జైన్ నిర్మిస్తున్నాడు.
రాజ్ కుమార్ సంతోషి (Rajkumar Santoshi) తెరకెక్కిస్తున్న 'లాహోర్ 1947' (Lahore 1947) లో ఆమీర్ నటిస్తున్నాడు. ఇది కాకుండా ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న రజనీకాంత్ (Rajinikanth) 'కూలీ' (Coolie) లోనూ ఆమీర్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. అలానే తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తోనూ ఓ మూవీ చేసేందుకు ఆమీర్ ప్రాధామికంగా అంగీకరించాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ సినిమా కూడా ఇదే యేడాది సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. అలానే రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్ దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) బయోపిక్ లోనూ నటించబోతున్నాడని ఇటీవలే ఓ వార్త వచ్చింది. ఇవి కాకుండా ఆమీర్ ఖాన్ మరో రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు చేస్తున్నాడని అంటున్నారు... మొత్తం మీద గత కొంతకాలంగా నటనకు దూరంగా ఆమీర్ ఇప్పుడు ఒక్కసారి సింహం జూలు విదిల్చినట్టుగా... వడివడిగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
Also Read: Pan India: రాజమౌళి, సుకుమార్... ఆ తర్వాత...
Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి