Mahesh Babu: కెన్యా షూటింగ్ వదిలి సడెన్ గా ఇంటికి మహేష్.. ఏమైంది
ABN, Publish Date - Sep 06 , 2025 | 09:42 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది నుంచే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఒడిస్సాలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన జక్కన్న.. ఒక పెద్ద షెడ్యూల్ కోసం ఈ మధ్యనే కెన్యా వెళ్లారు.
కొన్నిరోజుల క్రితమే రాజమౌళి కెన్యా మినిస్టర్ ను కలిసిన విషయం తెల్సిందే. ఇక కెన్యాలోనే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో సడెన్ గా మహేష్.. ఇంటికి వచ్చాడని తెలుస్తోంది. షూటింగ్ పక్కన పెట్టి మరీ హుటాహుటిన మహేష్ హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి అంటే.. కొడుకు గౌతమ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గౌతమ్.. విదేశాల్లో ఫిల్మ్ స్కూల్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఇక ఫిల్మ్ స్కూల్ లో గౌతమ్ ను కొందరు ర్యాగింగ్ చేశారట. వెంటనే గౌతమ్ తండ్రికి కాల్ చేయగా .. అన్నింటిని వదిలి వెంటనే ఇంటికి రమ్మని చెప్పగా.. నమ్రత, సితార.. గౌతమ్ ను తీసుకొని రావడానికి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక గౌతమ్ ను ఓదార్చడానికి మహేష్ షూటింగ్ ను పక్కన పెట్టి మరీ వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్.. కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడుకు మనోవేదనకు గురయ్యాడని తెలుసుకున్న మహేష్.. ఇప్పుడు తండ్రి తోడు అవసరమని వెంటనే వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Boney Kapoor: శివగామి పాత్రకు శ్రీదేవి డిమాండ్లు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన బోనీ కపూర్
SSMB29: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా.. శ్రీరాముడిగా మహేష్