SSMB29: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా.. శ్రీరాముడిగా మహేష్

ABN , Publish Date - Sep 06 , 2025 | 06:08 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)- రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న చిత్రం SSMB29.

SSMB29

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)- రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న చిత్రం SSMB29. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి లీకైన ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించిన ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.


SSMB29 లో రాజమౌళి అభిమానులకు ఒక సర్ ప్రైజ్ కాదు కాదు పెద్ద ట్విస్ట్ ఇవ్వనున్నాడట. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో మహేష్ శ్రీరాముడిగా కనిపించనున్నాడని ఒక రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు మహేష్.. ఇలాంటి పాత్రలో నటించలేదట. సెకండాఫ్ లో వచ్చే సీన్స్ కోసం రాముడి గెటప్ లో మహేష్ కనిపించనున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూట్ కూడా పూర్తిచేశారని అంటున్నారు.


ఇక ఇదే కనుక నిజమైతే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఏ సినిమాలో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు కనిపించినా.. అది మహేష్ నే అంటూ ఫ్యాన్స్ రచ్చ చేయడం పరిపాటిగా మారింది. కానీ, జక్కన్ననే ఏకంగా మహేష్ ను రాముడిగా చూపించబోతున్నాడని తెలియగానే ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. మామూలుగానే ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఇక ఈ విషయం తెలియడంతో.. మరింత హైప్ పెరిగిపోయింది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Andhra King Taluka: రామ్ పాడిన సాంగ్ ప్రోమో వచ్చేసింది

Inspector Zende: బికినీ కిల్లర్.. కరుడుగట్టిన నేరస్థుడు చార్లెస్ శోభరాజ్ ను పట్టుకున్న పోలీస్ కథ

Updated Date - Sep 06 , 2025 | 06:10 PM