Vijay - Rashmika: ఇండియా డే పరేడ్‌లో విజయ్, రష్మిక..
ABN, Publish Date - Aug 18 , 2025 | 09:45 AM
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక 9Rashmika Mandanna) అమెరికాలో సందడి చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ సిటీలో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక హాజరయ్యారు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక 9Rashmika Mandanna) అమెరికాలో సందడి చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్ సిటీలో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక హాజరయ్యారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా డే పరేడ్‌లో ఈ జంట స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఒకరిచేయి ఒకరు పట్టుకొని నడవడంతో ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నో రోజుల తర్వాత ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించారని అభిమానులు ఆనందిస్తున్నారు.
ALSO READ: Manchu Family: అవ్రామ్‌కు అవార్డు.. విష్ణు అన్నా అంటూ మనోజ్ ట్వీట్..
వీరిద్దరూ కలిసి గీత గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. గీత గోవిందం చిత్రం నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనీ, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. వీటిని ఎన్నోసార్లు ఖండించినా ఆ గాసిప్‌లకు ఫుల్‌స్టాప్ మాత్రం పడటం లేదు. దానికి తోడు ఈ జంట టూర్లు, షికార్లు చేసని ఫొటోలు వైరల్ కావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే ఇప్పుడు మూడోసారి ఈ జంట తెరపై సందడి చేయనున్నారని తెలుస్తోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఇందులో రష్మిక కథానాయికగా ఎంపికైనట్లు వార్తలొస్తున్నాయి.
ALSO READ: Tollywood: సమస్యలకు పరిష్కారం చూపిస్తానని చిరు భరోసా ఇచ్చారు..
Anil Sunkara: సరిలేరు నీకెవ్వరుకు కొవిడ్ దెబ్బ...
Akkineni Venkat: ఏయన్నార్, దాసరి మధ్య వివాదానికి తెరపడింది ఎలా అంటే..