Manchu Family: అవ్రామ్‌కు అవార్డు.. విష్ణు అన్నా అంటూ మనోజ్ ట్వీట్..
ABN , Publish Date - Aug 18 , 2025 | 08:26 AM
‘భయ్యా.. అంతా సర్దుకున్నట్టేనా’ అంటూ మంచు ఫ్యామిలీని ఉద్దేశించి సోషల్ మీడయాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీనంతటికీ మంచు విష్ణు పోస్టుకు మనోజ్ రిప్లై ఇవ్వడమే కారణం.
‘భయ్యా.. అంతా సర్దుకున్నట్టేనా’ అంటూ మంచు ఫ్యామిలీని (Manchu Family) ఉద్దేశించి సోషల్ మీడయాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. దీనంతటికీ మంచు విష్ణు పోస్టుకు మనోజ్ రిప్లై ఇవ్వడమే కారణం. ఇంతకీ ఏం జరిగిందంటే.. మంచు విష్ణు (Manchu Vishnu) తనయుడు అవ్రామ్ భక్త వత్సలం (Avraam) మంచు విష్ణు కీలక పాత్రలో ముకేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప చిత్రంతో బాల నటుడిగా పరిచయమయ్యారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించి, విమర్శకులను మెప్పించింది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంతోషం ఫిల్మ్ అవార్డ్స్’లో అవ్రామ్‌కు అవార్డు లభించింది. తనకు అవార్డు వచ్చినందుకు అవ్రావ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ మీ ముందుకు వస్తానని చెప్పాడు. ఇదే వేదికపై మోహన్‌బాబు, విష్ణు, వెరానికా, అశ్వినీదత్ తదితరులు ఉన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇది ఆ పరమేశ్వరుడి దయ.. నాన్నగారి ఆశీస్సులు’ అంటూ అని అన్నారు. విష్ణు పోస్ట్ చేసిన ఈ వీడియోలో నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి మంచు మనోజ్ స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘కంగ్రాట్స్ అవ్రామ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే మరింత రాణించాలి నాన్న. విష్ణు అన్న, నాన్న మోహన్‌బాబుగారితో కలిసి అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం. ఎంతో ప్రేమతో’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే మంచు విష్ణు పేరును ప్రస్వాతిస్తూ మనోజ్ (Manchu Manoj) పోస్ట్ పెట్టడంతో ‘భయ్యా.. అంతా సర్దుకున్నట్టేనా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కొన్ని నెలలుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాలు గరించి తెలిసిందే. మనోజ్, విష్ణు ఒకరిపై ఒకటరు మాటల యుద్దం చేసుకున్నారు. ‘కన్నప్ప’ విడుదల సమయంలో మనోజ్ పెట్టిన పోస్టులో విష్ణు పేరును ప్రస్తావించకపోవడం, ఇప్పుడు అన్నా అని ట్వీట్‌లో పేర్కొనడంతో మంచు కుటుంబంలో సమస్యలు సమసిపోయినట్లు భావిస్తున్నారు అభిమానులు.
ALSO READ: Tollywood: సమస్యలకు పరిష్కారం చూపిస్తానని చిరు భరోసా ఇచ్చారు..
Anil Sunkara: సరిలేరు నీకెవ్వరుకు కొవిడ్ దెబ్బ...
Akkineni Venkat: ఏయన్నార్, దాసరి మధ్య వివాదానికి తెరపడింది ఎలా అంటే..