Dragon: ఎన్టీఆర్ మూవీలో విద్యాబాలన్...
ABN , Publish Date - May 21 , 2025 | 05:50 PM
మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల్లోనూ నటించిన విద్యాబాలన్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్ (Vidhya Balan) తెలుగులో ఇప్పటి వరకూ ఒకే ఒక్క సినిమాలో నటించింది. నటరత్న నందమూరి తారకరామారావు (NTR) బయోపిక్ గా వచ్చిన 'కథానాయకుడు, మహానాయకుడు' చిత్రాలలో ఆమె ఎన్టీఆర్ భార్య బసవ తారకంగా నటించింది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన విద్యాబాలన్ ను నందమూరి బాలకృష్ణ (Balakrishna) దంపతులు సాదరంగా ఆహ్వానించి, పట్టుచీర, పసుపు కుంకుమలు ఇచ్చి గౌరవించారు. ఆ రకంగా తెలుగు సినిమా రంగాన్ని ఆమె ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని పొందింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు మరోసారి నందమూరి కుటుంబంతో సినిమా చేసే అవకాశం విద్యాబాలన్ కు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) దర్శకత్వంలో 'డ్రాగన్' (Dragon) మూవీలో నటిస్తున్నాడు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీలో విద్యాబాలన్ ఓ కీలక పాత్ర పోషించబోతోందని సమాచారం. విద్యాబాలన్ ను ఓ పవర్ ఫుల్ రోల్ లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట. 'డ్రాగన్' మూవీకి ఉన్న స్కోప్ దృష్ట్యా ప్రశాంత్ నీల్ ఆ పాత్రను ప్రత్యేక శ్రద్థతో తీర్చిదిద్దబోతున్నాడట. గతంలోనూ 'కేజీఎఫ్ -2' (KGF -2) లో బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) ను సిల్వర్ స్క్రీన్ మీద స్పెషల్ గా పోట్రేట్ చేశాడు ప్రశాంత్ నీల్. అతని ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో పెట్టుకునే విద్యాబాలన్ సైతం ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన 'డ్రాగన్' మూవీలో రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) నాయికగా నటిస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ (Ajaneesh Lokanth) సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం వచ్చే యేడాది జూన్ 25న జనం ముందుకు రాబోతోంది.
Also Read: Pawan Kalyan: ఘనంగా హరి హర వీరమల్లు అసుర హననం గీతావిష్కరణ
Also Read: Seetharama Sastry: రామజోగయ్య శాస్త్రికి సిరివెన్నెల పురస్కారం
Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి