Varalaxmi Sarathkumar: మెగాఫోన్ పట్టింది..రూట్ మార్చేసింది

ABN , Publish Date - Sep 27 , 2025 | 10:50 AM

సరస్వతి’వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. హీరోయిన్‌గా, విలన్‌గా, మహిళా ప్రాధాన్యం ఉన్న కథలతో తనకంటూ ఓ సెపరేట్‌ ట్రాక్‌ క్రియేట్‌ చేసుకుంది. న

Varalakshmi Sarathkumar

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (vara Lakshmi Sarathkumar) మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. హీరోయిన్‌గా, విలన్‌గా, మహిళా ప్రాధాన్యం ఉన్న కథలతో తనకంటూ ఓ సెపరేట్‌ ట్రాక్‌ క్రియేట్‌ చేసుకుంది. నటిగా హద్దులు పెట్టుకోకుండా నటనకు న్యాయం చేయగలిగే ప్రతి పాత్రను చేస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడామె మరో కొత్త స్టెప్‌ వేయబోతున్నారు. తన సోదరి పూజా శరత్‌కుమార్‌ తో కలిసి డోసా డైరీస్‌ (Dosa Diaries) పేరుతో కొత్త ప్రొడక్షన్‌ బ్యానర్‌ను ప్రారంభించారు. అంతే కాదు.. ఈ బ్యానర్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. ఆమె మెగా ఫోన్‌ పట్టి ‘సరస్వతి’ (Saraswathi) అనే టైటిల్‌తో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఆమె శనివారం అధికారికంగా ప్రకటించారు. ఐదు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.

Prakash-Raj.jpg
 
ఈ మేరకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘దర్శకురాలిగా కొత్త జర్నీ ప్రారంభిస్తున్నానని చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నా. నా అక్క పూజాతో కలిసి ప్రొడక్షన్‌ హౌస్‌ మొదలుపెట్టి ఈ సినిమా చేస్తున్నా. కొత్త కథల్ని ప్రేక్షకుల్ని అలరించేందుకు ఈ బ్యానర్‌ను ప్రారంభించాం.  నటిగా ఎంతో ప్రోత్సహించారు. ఇప్పుడు దర్శకురాలిగా కూడా నన్ను మరో అడుగువేసేలా ఆశీర్వదిస్తారని కోరుతున్నాను’ అని అన్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ప్రియమణి, ప్రకాశ్‌రాజ్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రధారులు. తమన్‌ సంగీతం అందించనున్నారు.  


ALSO READ: Saturday Tv Movies: శ‌నివారం, Sep 27.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాల జాబితా

OG Movie: ఓజీ.. ఇక ముందు కష్టమే

Little Hearts OTT: కాత్యాయనీ.. ఓటీటీకి వస్తుందిరోయ్

OG Mania: 'ఓజీ' థీమ్ హుడీతో మెస్మరైజ్

Updated Date - Sep 27 , 2025 | 11:06 AM