సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rama Satyanarayana: శరవేగంగా 'మహానాగ' షూటింగ్...

ABN, Publish Date - Oct 06 , 2025 | 02:12 PM

ఆగస్ట్ 15వ తేదీ ఏకంగా 15 చిత్రాలను ప్రారంభించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తన బ్యానర్ లోని 118వ సినిమా 'మహానాగ' రెగ్యులర్ షూటింగ్ ను ఆరంభించారు. ఉదయ భాస్కర వాగ్దేవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రావణి ముప్పిరాల హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

Mahaa Naga movie

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Thummalapalli Rama Satyanarayana) ఆగస్ట్ 15వ తేదీ ఏకంగా 15 చిత్రాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ ను ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తున్నారు. అలానే సెట్స్ పైకి వచ్చిన ప్రతి సినిమాను ఆలస్యం లేకుండా వరుస షెడ్యూల్స్ తో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు రామ సత్యనారాయణ. అలానే ఇటీవల ఆయన బ్యానర్ లో 118వ చిత్రంగా 'మహానాగ' (Maha Naga) రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతల మండలి అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కె. ఎల్. దామోదర ప్రసాద్ (K.L. Damodara Prasad) క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు (Relangi Narasimha Rao) గౌరవ దర్శకత్వం వహించారు.


'మహానాగ' చిత్రానికి ఉదయ భాస్కర వాగ్దేవి దర్శకుడు. ఈ సినిమా ద్వారా శ్రావణి ముప్పిరాల హీరోయిన్ గా పరిచయం అవుతోంది. రమాకాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఇతర ప్రధాన పాత్రలను సుమన్, శ్రీకావ్య, టంగుటూరు రామకృష్ణ, 'బస్ స్టాప్' కోటేశ్వరరావు, జబర్దస్త్ అప్పారావు, సుబ్బలక్ష్మీ, టి.ఆర్.ఎస్., ధీరజ అప్పాజీ, సంధ్యా వర్షణి తదితరులు పోషిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుని, రెండో షెడ్యూల్ తాడేపల్లి గూడెం పరిసర ప్రాంతాలలో జరపుకోనుంది. ఈ చిత్రానికి సంధ్యావర్షణి సంగీతం అందిస్తున్నారు.

Also Read: Lokah: Chapter 1: మహిళా చిత్రాల్లో రికార్డు.. అతని సినిమానే కొట్టేసింది..

Also Read: Bad Boy Karthik: ఇలాంటి డైలాగ్స్ అవసరమా నీకు...

Updated Date - Oct 06 , 2025 | 02:14 PM