Bad Boy Karthik: ఇలాంటి డైలాగ్స్ అవసరమా నీకు...

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:53 PM

యువ కథానాయకుడు నాగశౌర్య లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బోయ్ కార్తీక్' టీజర్ విడుదలైంది. నటి పూర్ణ ఇందులో నెగెటివ్ క్యారెక్టర్ చేయగా, శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్రను పోషించింది. అతి త్వరలోనే ఈ సినిమా జనం ముందుకు రానుంది.

Naga Sourya New movie Bad Boy Karthik

హీరో నాగశౌర్య నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఈ సినిమాకు రామ్ దేశినా (రమేశ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మాత. త్వరలో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమానుండి టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. మొదటి నుండి నిర్మాతలు చెప్పినట్టుగానే ఇది పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ అనేది అర్థమౌతోంది.


ఈ టీజర్ లో కొంత వినోదానికి ప్రాధాన్యమిచ్చినా... పాటలను మాత్రం మేకర్స్ ఇందులో చూపించలేదు. అలానే హీరోయిన్ విధికి సంబంధించిన ఒక్క షాట్ కూడా లేదు. కాస్తంత గ్యాప్ తర్వాత 'సుందరకాండ'తో రీ-ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి విజయ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. నటి పూర్ణ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసినట్టుగా ఈ టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఇతర కీలక పాత్రలు పోషించిన సముతిరకని, సాయికుమార్, నరేశ్‌, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, మైమ్ గోపీ తదితరులు ఎనభై సెకన్ల నిడివి ఉన్న టీజర్ లో కనిపించారు. ఇటీవల ఈ సినిమా కోసం స్నేహా గుప్తాపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలై మాస్ ను బాగానే ఆకట్టుకుంది. అతి త్వరలోనే మూవీని విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. 'బ్యాడ్ బోయ్ కార్తీక్' మూవీకి హారిస్ జైరాజ్ సంగీతాన్ని అందించగా, రసూల్ ఎల్లోర్ డీవోపీ.

Also Read: Chiranjeevi, Balakrishna: స్టార్ హీరోల చిత్రాలకు కొరత...

Also Read: Samantha: మూడు నెలలకు ఓసారి.. కొన్నేళ్లగా ఇలా జరుగుతుంది..

Updated Date - Oct 06 , 2025 | 12:56 PM