Lokah: Chapter 1: మహిళా చిత్రాల్లో రికార్డు.. అతని సినిమానే కొట్టేసింది..
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:58 PM
దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘లోక చాప్టర్ 1: చంద్ర’ మలయాళ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. ఇప్పటివరకు మలయాళంలో చిన్న బడ్జెట్ సినిమాల చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మాణంలో తెరకెక్కిన ‘లోక చాప్టర్ 1: చంద్ర’ (Lokah: Chapter 1 Chandra) (మలయాళ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. ఇప్పటివరకు మలయాళంలో చిన్న బడ్జెట్ సినిమాల చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. దేశంలో 152.96 కోట్లు కలెక్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి రూ. 297 కోట్లు వసూలు చూసిన ఈ చిత్రం త్వరలోనే రూ.300 కోట్ల మార్కును దాటుతుందని చెబుతున్నారు. 'లోకా' సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.152.96 కోట్లు వసూలు చేయగా, మలయాళ వెర్షన్ రూ.119.46 కోట్లు వసూలు చేసింది. దీనితో ఈ సినిమా ఇప్పుడు మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. మోహన్ లాల్ నటించిన 'తుడారుమ్' సినిమా రూ.118.6 కోట్లు వసూలు చేయగా, ఈ సినిమా మొత్తం రూ.122 కోట్లు వసూలు చేసింది.
కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లెన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్ నిర్మించారు. విడుదలై 38 రోజుల్లో దక్షిణాధిలో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.దేశంలోనే విమెన్ సెంట్రిక్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో రెండో స్థానంలో ఉందీ సినిమా. ఈ మధ్యకాలంలో కలెక్షన్ పరంగా ఈ చిత్రం మలయాళ చరిత్ర నంబర్ వన్ గ్రాసర్ అని చెబుతున్నారు. ఇక గ్లోబల్ స్థాయిలో రూ. 297 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్ దాటే దిశగా పయనిస్తోంది. ‘లోక’ యూనివర్స్‌లో మొత్తం ఐదు చాప్టర్లు రాబోతున్నాయి. రాబోయే సినిమాల్లో టోవినో థామస్, మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది.