Deepavali Box Office War:దీపావళి టార్గెట్ ఫిక్స్
ABN, Publish Date - Jul 01 , 2025 | 06:30 PM
దీపావళి అంటే కేవలం బాంబుల మోతే కాదు.. బాక్సాఫీస్ దగ్గర కూడా మోత గట్టిగానే ఉంటుంది. భారీ వసూళ్ళతో రికార్డులు బ్లాస్ట్ చేయడానికి హీరోలు రెడీ అయిపోతుంటారు. మరి ఈ దీపావళి రేసులో ఉండబోతున్న హీరోలెవరు? ఏ సినిమాలు బాక్సాఫీస్ బరిలో భారీగా సౌండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
పండగలకు చిత్ర పరిశ్రమకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఫెస్టివల్ వస్తోందంటే చాలు జోష్ తో పాటు పెద్ద పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అయిపోతాయి. ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి పండగలకు పక్కాగా సినిమాలు విడుదల కావాల్సిందే. స్ట్రాంగ్ స్టోరీ, కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇలా అన్నీ కుదిరితే ఎంత పోటీ ఉన్నా... పండగ సీజన్ లో కాసుల వర్షం కురిసి తీరాల్సిందే. ఇప్పుడు దీపావళీకి పలు చిత్రాలు సందడి చేయబోతున్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్ లో బిగ్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో యంగ్ హీరోలు దివాళీకి తమ జోరు చూపించబోతున్నారు. ఎలాగైనా ఈ ఫెస్టివల్ ను యూజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోతున్నారు. అందుకే వరుసగా మిడ్ రేంజ్ సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. దీంతో ఈ సారి దీపావళి విన్నర్ గా ఎవరు నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది. గతేడాది దీపావళి బరిలో నిలిచిన 'క'(‘KA’), 'లక్కీ భాస్కర్ (Lucky Baskhar)', 'అమరన్' (Amaran) చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇందులో పాన్ ఇండియా చిత్రాలు 'లక్కీ భాస్కర్, అమరన్' వంద కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేయగా 'క' యాభై కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
'క' చిత్రం తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన 'దిల్ రుబా' (Dil ruba)చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో తనకు కలిసి వచ్చిన దీపావళి సీజన్ లో ఇప్పుడు 'కె ర్యాంప్'(K Ramp)ను రిలీజ్ చేయబోతున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో దివాలీకి వచ్చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశాడు. అలానే 'జాక్ (Jack)'తో డిజాస్టర్ ను అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కూడా దీపావళి సీజన్ పై కన్నేశాడు. అతని తాజా చిత్రం 'తెలుసు కదా'(Telusu Kada)తో నీరజ కోన (Neeraja Kona) దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా దీపావళి కానుకగా అక్టోబర్ 17న రాబోతోంది. అధికారికరంగా ఈ రెండు సినిమాలు రేస్ లో నిలిచినప్పటికి మరికొన్ని తెలుగు సినిమాలు కర్చీఫ్ వేసుకునే అవకాశం ఉంది. మరోవైపు పండక్కి పెద్ద ప్రాజెక్టులు లేకపోవడంతో పరబాష చిత్రాలు బాక్సాఫీస్ వార్ లోకి దిగుతున్నాయి. ముఖ్యంగా రెండు సినిమాలు రెడీ అయ్యాయి.
దీపావళిని టార్గెట్ చేస్తూ రెండు, మూడు పరబాష సినిమాలు సైతం బరిలోకి దిగున్నాయి. 'లవ్ టుడే, డ్రాగన్' చిత్రాలతో మంచి మార్కులు కొట్టేసిన ప్రదీప్ రంగనాధన్ (Pradeep Ranganathan) ‘డ్యూడ్’ (Dude)అంటూ వచ్చేస్తున్నాడు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది. అలానే కార్తి (Karthi )నటించిన 'సర్దార్ (Sardar)' మూవీ 2022 దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో తండ్రీ కొడులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. ఇప్పుడు 'సర్దార్ 2'(Sardar2)ను కూడా దీపావళికే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. అలానే సూర్య, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'కరుప్పు' కూడా దీపావళి పండగను టార్గెట్ చేసుకుని షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అన్నదమ్ములిద్దరూ బాక్సాఫీస్ బరిలోకి దిగే ఛాన్స్ ఉండదు కాబట్టి ఎవరో ఒకరు వెనక్కి వెళ్ళొచ్చు. 2024లో మోతమోగించినట్లే 2025లో ఏది పేలుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా భారీ సౌండ్ చేస్తుందో... మరే సినిమా తుస్సుమంటుందో చూడాలి.
Also Read: Ramayanam: రామాయణ్.. ప్రపంచానికి ఇచ్చే బహుమతి
Also Read: Rashmika Mandanna: సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన రష్మిక.. ఏకిపారేస్తున్న నెటిజన్స్