Rashmika Mandanna: సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిన రష్మిక.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:51 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా( Rashmika Mandanna) ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు చిత్ర పరిశ్రమ మొత్తానికే టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా( Rashmika Mandanna) ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు చిత్ర పరిశ్రమ మొత్తానికే టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అమ్మడు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. గత కొన్నేళ్లుగా ఆమె నటించిన ప్రతి పాన్ ఇండియా సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో కూడా చేరుతున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికకు వివాదాలు కొత్తకాదు. అమ్మడు అందరిముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం.. ఆమెనే ఆ స్టేట్మెంట్ ను బ్రేక్ చేయడం.. దాన్ని ట్రోలర్స్ ట్రోల్ చేయడం జరుగుతూనే ఉంది.
గతంలో రష్మిక.. పాత్రకు ప్రాధాన్యత లేకుండా హీరోల వెంటపడి.. సాంగ్స్ కు మాత్రమే పరిమితమయ్యే పాత్రలు చేయనని ఖరాఖండీగా చెప్పేసింది. కానీ, ఆ తరువాత సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబు సరసన అలాంటి పాత్రలోనే నటించి ట్రోల్ కు గురైంది. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఈ సినిమాలో నువ్వు చేసింది ఏంటి అంటూ నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఇక ఆ ఒక్క సినిమాలో తప్ప రష్మిక మిగిలిన సినిమాల్లో మంచి పాత్రలనే ఎంచుకుంటూ వచ్చింది. దీంతో అక్కడితో ఆ విషయాన్నీ నెటిజన్స్ వదిలేశారు.
ఇక తాజాగా మరోసారి రష్మిక మరో కొత్త స్టేట్మెంట్ పాస్ చేసింది. సిగరెట్ తాగే సన్నివేశాలు ఉన్న సినిమాలను చేయనని, అలా చేయాల్సి వస్తే సినిమానే మానేస్తానని చెప్పి షాక్ ఇచ్చింది. తాజాగా వి ద విమెన్ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక తాను స్మోకింగ్ ను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించను అని చెప్పుకొచ్చింది. ' వ్యక్తిగతంగా నేను సిగరెట్ తాగను. సినిమాల్లో కూడా వాటిని నేను ప్రోత్సహించను. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా ఇష్టపడను. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఒకవేళ అలాంటి సీన్స్ కచ్చితంగా సినిమాలో ఉండాలి అని అంటే.. ఆ సినిమాను వదులుకుంటాను' అని చెప్పుకొచ్చింది.
ఇక రష్మిక స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిజంగా రష్మిక తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ, ఆమె సినిమాల్లో ఆల్రెడీ స్మోకింగ్ సీన్ లో నటించింది. భీష్మ సినిమాలో నితిన్ సిగరెట్ కాలుస్తుంటే.. ఆమె లాక్కొని మరీ సిగరెట్ తాగుతుంది. ఆ సిగరెట్ నిజమైందా.. ? కాదా.. ? అనేది పక్కన పెడితే అది కూడా సిగరెట్ తాగినట్లే కదా. ఆ లెక్కన ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నీ స్టేట్మెంట్ ఏమైంది. అప్పుడు సిగరెట్ తాగడం నీకు నచ్చదు అని తెలియదా అని ఏకిపారేస్తున్నారు.
సిగరెట్ విషయంలో రష్మిక ట్రోల్ అవ్వడం ఇదేమి కొత్త కాదు. చాలాసార్లు నెటిజన్స్ ఆమెను ఈ విషయంలో ట్రోల్ చేశారు. ప్రస్తుతం రష్మిక స్మోకింగ్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు. స్మోకింగ్ విషయంలో అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చి చివరకు అడ్డంగా దొరికిపోయిన రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, మైసా, థామా లాంటి సినిమాలలో నటిస్తుంది.
Ram Pothineni: హీరో రామ్ కు తప్పిన ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు తాగి వచ్చి..