Mirai: ఇదే చరిత్ర.. ఇదే భవిష్యత్తు.. ఇదే మిరాయ్..
ABN, Publish Date - Aug 28 , 2025 | 02:03 PM
'హనుమాన్’తో ఊహించని విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు అదే జోష్‌తో మరో ప్రయోగాత్మక చిత్రం ‘మిరాయ్’ చేస్తున్నాడు. ఇందులో తేజా సజ్జా సూపర్ యోధగా కనిపిస్తాడు.
'హనుమాన్’తో ఊహించని విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు అదే జోష్‌తో మరో ప్రయోగాత్మక చిత్రం ‘మిరాయ్’ చేస్తున్నాడు. ఇందులో తేజా సజ్జా సూపర్ యోధగా కనిపిస్తాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ప్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వ ప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. దాదాపు 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లలో సెప్టెంబర్ 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను వదిలారు. సింపుల్‌గా ఈ సినిమా కథ ఏంటి అన్నది టీజర్‌లో హింట్ ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్‌లో ఇంకాస్త క్లారిటీ ఇచ్చారు. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరన్, జగపతిబాబు ఇలా మెయిన్ ఆర్టిస్ట్‌లు అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తూ ట్రైలర్ కట్ చేశారు. 3 నిమిషాల ఆరు సెకెన్ల ట్రైలర్ అంతకు మించి ఆసక్తిగా ఉంది.
‘ఈ ప్రమాదం ప్రతీ గ్రంధాన్నీ చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయ్‌ని చేరుకోవాలి’
‘తొమ్మిది గ్రంధాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం’ (జగపతిబాబు)
శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం..
‘నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని తల్లి నమ్మింది. ఇక నేను నమ్మడమే మిగిలింది’
అన్న డైలాగ్‌లతో కథా నేపథ్యం ఏంటనేది అర్ధమవుతోంది.
ఈ డైలాగ్‌లను బట్టి తనకి తెలియకుండానే జనాలకు మంచి చేసిన హీరో.. తనలోని శక్తిని నమ్మి.. వారి నమ్మకాన్ని ఎలా నిలబెట్టగలిగాడు అనే అంశంతో సినిమా సాగనుందని తెలుస్తోంది. తొమ్మిది గ్రంథాలు విలన్‌కి దొరక్కుండా పెను ముప్పుని హీరో తప్పించాడా? లేదా? శ్రీరాముడు తన భక్తులకు సహాయం చేసేందుకు కదిలి వస్తాడా? అనేది కథ అన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ALSO READ: Pa Ranjith: పీ.ఎన్.జీ. దేశం నుండి ఆస్కార్ కు ఎంట్రీ
‘నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం’ అంటూ మంచు మనోజ్ చెప్పిన డైలాగ్, యాక్షన్స్ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. గ్రద్థతో ఉన్న సీన్స్ గమనిస్తే ఈ తరహా అవుట్‌పుట్ కోసం సినిమా వాయిదా పడటం మంచిదే అనిపిస్తుంది.
‘ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్’ అంటూ చెప్పిన డైలాగ్స్, ట్రైలర్ చివర్లో ‘ఈ మహాకార్యాన్ని పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు.. నీకో సాయం అవసరం పడుతుంది’ అని శ్రియ అన్నప్పుడు శ్రీరాముడి దర్శనం గూస్ బంప్స్ ఇస్తోంది.
యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. హరి గౌర నేపథ్య సంగీతం అదరగొట్టాడు. గ్రాఫిక్స్ పెద్ట పీట వేశారు. క్వాలిటీ విషయంలో నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అన్ని అనుకున్నట్లు కలిసొస్తే.. తేజా సజ్జాకు మరో పాన్ ఇండియా హిట్ ఖాయమనిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మధ్య తీసిన ఏ సినిమా లాభాలు తీసుకురాలేదు. ఈ చిత్రం ఆ సంస్థ కష్టాలను తీర్చేసేలా ఉంది.
ALSO READ: Tourist Family: సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా...
Coolie and Lokah: ఫిల్మ్ మేకర్స్ తప్పు మీద తప్పు...