Kingdom-Taran adarsh: అంచనాలు మించేలా వస్తున్నాడు.. తరణ్ ఆదర్శ్ ట్వీట్ వైరల్..
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:39 PM
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’. ఈ చిత్రం హిందీ టైటిల్ ను తరణ్ ఆదర్శ్ రివీల్ చేశారు
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ (Kingdom). భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శనివారం తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు చక్కని స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ALSO READ: Naga Chaitanya: కొడుకు పుడితే అలా.. కూతురు ఐతే ఇలా..
ఈ సినిమాకు సంబంధించి క్రిటిక్, ట్రేడ్ ఎనలిస్ట్ తరన్ ఆదర్శ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బాలీవుడ్‌లో టైటిల్ గురించి తెలిపారు. ‘విజయ్ దేవరకొండ నెక్ట్స్ పాన్ ఇండియా చిత్రం కింగ్డమ్’ హిందీ ‘సామ్రాజ్య’ టైటిల్‌తో విడుదల కానుంది. హిందీ ట్రైలర్ కూడా విడుదలైంది. ట్రైలర్ గ్రాండ్ ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈ చిత్రంతో విజయ్ మళ్లీ బిగ్ పై చూడబోతున్నాం. అంచనాలకు మించేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు. ప్రస్తుతం తరణ్ ఆదర్శ్ ట్వీట్ వైరల్ అవుతోంది.
ALSO READ:
ANR: 'దేవదాసు' పాత్ర గురించి అభిమానికి జవాబు
Dukkipati madhusudhanarao: మరపురాని చిత్రాలు అందించిన 'అన్నపూర్ణ పిక్చర్స్'
Prabhas Spirit Movie: సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి
Sai Kumar: 'డైలాగ్ కింగ్' అంటే సాయికుమార్
Coolie Emotional Role: అందరికీ కనెక్ట్ అయ్యే పాత్ర