Asian Suniel: 24 గంటల్లోనే.. TFCC అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా
ABN, Publish Date - Jun 08 , 2025 | 07:49 PM
గత నెల రోజులుగా టాలీవుడ్‌లో జరుగుతున్నథియేటర్ల బంద్, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల అంశ నానుతూ నానుతూ ఆదివారం కొత్త మలుపు తిరిగింది.
గత నెల రోజులుగా టాలీవుడ్‌లో జరుగుతున్నథియేటర్ల బంద్, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల అంశ నానుతూ నానుతూ ఆదివారం కొత్త మలుపు తిరిగింది. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) (President of Telangana State Film Chamber of Commerce) అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ (Suniel Narang) అధికారికంగా రాజీనామా చేశారు. వరుసగా మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల లోపే సునీల్ రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ మేరకు ఆయన ఓ లెటర్ విడుదల చేసి ఆయన రాజీనామాకు గల కారణాలను వివరించారు.
ఇటీవల నా ప్రమేయం లేకుండా కొంతమంది నాకు సంబంధం లేని విషయాల్లో పబ్లిక్ స్టేట్‌మెంట్లు, నా ప్రమేయం లేకుండానే ప్రకటనలు ఇచ్చి ఇబ్బంది కలిగిస్తున్నారని, వారు మాట్లాడేముందు నన్ను సంప్రదించడం లేదని అన్నారు. అలాంటి ప్రకటనలతో నాకు ఎలాంటి సంబంధం లేవని, వాటి విషయంలో నేను బాధ్యుడిని కానని పేర్కొన్నారు. నాకు తెలియకుండా జరిగిన వాటిలో నన్ను ఇన్‌వాల్వ్ చేయడం నచ్చ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈ పదవిని చేపట్టలేనని అంతుకే తక్షణమే రాజీనామా చేస్తున్నా అన్నారు. నా ఈ రాజీనామా లేఖను అధికారిక నోటీసుగా అంగీకరించి, సంస్థ సజావుగా పనిచేయడానికి తగిన వారసుడిని నియమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఛాంబర్‌ను కోరారు.
ఇదిలాఉంటే శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో టీఎఫ్‌సీసీకి కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ సహా 15 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. హీరోలు రెండేండ్లకో సినిమా చేయడం బాలేదని, రూ2 కోట్ల కలెక్షన్ తేలేని హీరోకు రూ.13కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారంటూ పలు తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో షాక్ తిన్న సునీల్ నారంగ్ వెంటనే గమనించి.. హీరోలు దేవుళ్లు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని, అసలు థియేటర్ల వ్యవహారంలో ఆ నలుగురు ఎవరూ లేరని, యజమానుల వద్దే వారి థియేటర్లు ఉన్నాయని పేర్కొన్నారు..