సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suma Kanakala: రాజీవ్ తో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన సుమ

ABN, Publish Date - Nov 08 , 2025 | 03:31 PM

యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) గురించి తెలియని రేలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై కూడా ఆమె తన యాంకరింగ్ తో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.

Suma Kanakala

Suma Kanakala: యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) గురించి తెలియని రేలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై కూడా ఆమె తన యాంకరింగ్ తో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. అసలు సుమ లేని ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కానీ, ఏ ఇంటర్వ్యూను కానీ లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించిన సుమ.. ఆ తరువాత నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి తరువాత సినిమాలు కాకుండా యాంకరింగ్ వైపు దృష్టి పెట్టి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది.

ఇక కెరీర్ లో ఒడిదుడుకులు ఉన్నట్లే సుమ పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. అనోన్యంగా సాగుతున్న వీరి దాంపత్యంలో మనస్పర్థలు తలెత్తాయి. ఒకానొక సమయంలో ఈ జంట విడిపోయారని, విడాకులు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలపై సుమ స్పందించింది. ఎప్పుడు ఎవరో ఒకరిని ఇంటర్వ్యూ చేసే సుమ.. తాజాగా ఒక పాడ్ కాస్ట్ కి గెస్ట్ గా వెళ్ళింది. ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న ప్రేమంటే చిత్రంలో కీలక పాత్రలో సుమ నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది.

రాజీవ్ తో విడాకులు అంటూ వస్తున్న రూమర్స్ పై సుమ మాట్లాడుతూ.. ' వివాహా బంధం అన్నాకా ఒడిదుడుకులు వస్తూనే ఉటాయి. భార్యభర్తల మధ్య మనస్పర్థలు అనేవి సహజం. ఇప్పటికి మా పెళ్లి జరిగి 25 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ళలో మేము చాలా చూసాం. నా కెరీర్, రాజీవ్ కెరీర్, పిల్లలు.. నా తల్లిదండ్రులు.. వారి తల్లిదండ్రులు .. వాటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూనే జీవితాన్ని సాగించాం. అలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు కొన్ని మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఎవరి జీవితం సాఫీగా సాగదు. ఇది కూడా లోక రోలర్ కోస్టర్ లాంటిదే. మేము సోషల్ మీడియాలో కనిపించినా కూడా ఏంటి మీరు విడిపోలేదా.. ? కలిసే ఉన్నారా.. ? అని అడుగుతున్నారు. కొందరు అయితే యాకంగా విడాకులు కూడా తీసుకున్నారు అని రాసుకొచ్చారు. ఒకప్పుడు వాటిని చూసి ఏంటి ఇలా రాస్తున్నారు అని అనుకొనేవాళ్ళం. ఆ తరువాత వాటిని పట్టించుకోవడం మానేశాము' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుమ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tollywood: చిరపుంజీలో తెలుగు సినిమా షూటింగ్ ఎలా సాగుతోందంటే...

K-Ramp: ఓటీటీలోకి ఈ ఏడాది బుర్ర పాడు చేసిన ఎంటర్టైనర్

Updated Date - Nov 08 , 2025 | 03:31 PM