K-Ramp: ఓటీటీలోకి.. బుర్ర పాడు చేసే ఎంటర్టైనర్
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:42 PM
'కె - రాంప్' ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఆహా ఓటీటీ ప్రకటించింది. '
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం 'కె- ర్యాంప్' (K Ramp). జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేష్ వీకే, సాయికుమార్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఆహా ఓటీటీ ప్రకటించింది. 'బుర్ర పాడు ఎంటర్టైనర్ కోసం రెడీ అవ్వండి' అంటూ నవంబర్ 15 నుంచి ఆహా (Aha)వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా తెలిపింది.
కథ: (K - Ramp Story)
కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) పెద్ద వ్యాపారవేత కృష్ణ (సాయికుమార్) గారాల బిడ్డ. పెద్దగా చదువు అబ్బట్లేదని, అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని కేరళలోని కాలేజ్ లో జాయిన్ చేస్తాడు తండ్రి. అక్కడ తొలి చూపులోనే మెర్సీ జాన్ (యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు కుమార్. ఆమెకు జీవితకాలం తోడుంటానని వరమిచ్చేస్తాడు. అసలు మెర్సీ ఎవరు? ఏంటి? అని చూడకుండా ప్రేమలో దిగిన కుమార్ తన ప్రేయసికి ఉన్న సమస్యతో ఇబ్బందులకు గురవుతాడు. అసలు జాన్ కున్న సమస్య ఏంటి? వారిద్దరూ ఒకటయ్యారా? లేదా? అల్లరి చిల్లరిగా తిరిగే కుమార్కు తండ్రి విలువ తెలిసివచ్చిందా? అనేది ఈ సినిమా కథ.