సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sridevi Vijayakumar: ప్రభాస్ ఇంకా చిన్నపిల్లాడే.. ఈశ్వర్ బ్యూటీ కామెంట్స్ వైరల్

ABN, Publish Date - Aug 19 , 2025 | 04:09 PM

అందం, అభినయం కలబోసిన రూపం శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar). కోలీవుడ్ నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా ఈశ్వర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యింది.

Sridevi Vijaykumar

Sridevi Vijayakumar: అందం, అభినయం కలబోసిన రూపం శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar). కోలీవుడ్ నటుడు విజయ్ కుమార్ కుమార్తెగా ఈశ్వర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాలోనే ఆమె అందం, అభినయం చూసి..ఇండస్ట్రీకి మరో స్టార్ దొరికింది అని చెప్పుకొచ్చారు. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. శ్రీదేవికి వరుస అవకాశలను అందించింది. అయితే అవేమి కూడా శ్రీదేవిని స్టార్ గా నిలబెట్టలేకపోయాయి. దీంతో శ్రీదేవి కెరీర్ ను వదిలేసి తండ్రి చూపించిన వ్యక్తిని వివాహమాడి గృహిణిగా సెటిల్ అయ్యింది.


పెళ్లి తరువాత కూడా అడపాదడపా స్క్రీన్ పై కనిపిస్తూ వచ్చిన శ్రీదేవి బుల్లితెర షోస్ పై కనిపించి కనువిందు చేసింది. ఒక బిడ్డకు తల్లి అయినా కూడా అమ్మడితో ఈ మాత్రం అందం తగ్గలేదు. ఇక చాలా గ్యాప్ తరువాత శ్రీదేవి తెలుగులో సుందరకాండ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించాడు. సుందరకాండ సినిమా ఆగస్టు 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను పెంచుతున్నారు.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ.. తన మొదటి సినిమా హీరో ప్రభాస్ గురించి చెప్పుకొచ్చింది. ' ఈశ్వర్ సినిమాతోనే ప్రభాస్ కు, నాకు స్నేహం మొదలయ్యింది. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రభాస్ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యిపోయాడు. అయినా కూడా అతనిలో మార్పు లేదు. ఇంకా చిన్నపిల్లాడిలానే నవ్వుతూ మాట్లాడతాడు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి శ్రీదేవి రీఎంట్రీ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Shruti Haasan: ఆ పోలిక నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు..

Lokesh Kanagaraj: కూలీ ఎఫెక్ట్.. ప్లాన్ మార్చిన లోకేష్

Updated Date - Aug 19 , 2025 | 04:28 PM