Shruti Haasan: ఆ పోలిక నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు..

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:16 PM

బాక్సాఫీస్‌ నంబర్లు కమల్‌హాసన్‌ను (Kamal Haasan) ప్రభావితం చేయలేవని ఆయన తనయ శ్రుతీహాసన్‌ (Shruthi Haasan) అన్నారు.


బాక్సాఫీస్‌ నంబర్లు కమల్‌హాసన్‌ను (Kamal Haasan) ప్రభావితం చేయలేవని ఆయన తనయ శ్రుతీహాసన్‌ (Shruthi Haasan) అన్నారు. థగ్‌లైఫ్‌ (Thug life) రిజల్ట్‌ గురించి ఆమె మాట్లాడారు. ఇటీవల కమల్‌ నటించిన ‘థగ్‌లైఫ్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చి మిశ్రమ ఫలితానికే పరిమితమైంది. ఈ సినిమా రిజల్ట్‌పై శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం ఇండస్ట్రీలో ఈ నంబర్ల ప్రస్తావన ఉండేది కాదు. మా నాన్న తన సొంత డబ్బు పెట్టి సినిమా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నంబర్ల గురించి ఆలోచించే మనస్తత్వం కాదు ఆయనది. వాటి గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటారు’ అని శ్రుతి హాసన్‌ తెలిపారు.

తాజాగా ‘కూలీ’ సినిమాతో ప్రీతి పాత్రలో అలరించింది. ఈ సినిమాతో హిట్‌ అందుకుంది. తాజాగా హాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి తన తండ్రి కమల్‌హాసన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను కమల్‌ హాసన్‌ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చాను. నాపై ఆయన ప్రభావం చాలా ఉంటుంది. నా నటనను ఆయన నటనతో పోలుస్తుంటారు. దానివల్ల నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. ఆయన ఎప్పుడూ నావెంట ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. ఇండస్ట్రీలోని ఎంతోమందిలో ఆయన స్ఫూర్తి నింపారు. ఆయన నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను’ అని అన్నారు. 

ALSO READ: Aishwarya Rai Bachchan: ఆత్మగౌరవాన్ని సోషల్‌ మీడియాలో వెతకొద్దు.. దొరకదు..

Kantara Chapter1: కాంతారా.. విల‌న్ 'కుల‌శేఖ‌ర' వ‌చ్చాడు

Suhas: 'మండాడి' సుహాస్ ఫస్ట్ లుక్ 

Updated Date - Aug 19 , 2025 | 04:23 PM