Lokesh Kanagaraj: కూలీ ఎఫెక్ట్.. ప్లాన్ మార్చిన లోకేష్

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:37 PM

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లుగా మారిపోయింది లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) పరిస్థితి. ఇప్పటివరకు ఒక్క ప్లాపును కూడా అందుకొని లోకేష్ మొట్టమొదటిసారి కూలీ (Coolie) సినిమాతో పరాజయాన్ని అందుకున్నాడు.

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj: ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లుగా మారిపోయింది లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) పరిస్థితి. ఇప్పటివరకు ఒక్క ప్లాపును కూడా అందుకొని లోకేష్ మొట్టమొదటిసారి కూలీ (Coolie) సినిమాతో పరాజయాన్ని అందుకున్నాడు. విక్రమ్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న లోకేష్ ఆ తర్వాత వరుస సినిమాలతో అభిమానులను మరింత పెంచుకుంటూ వచ్చాడు. ఆ హైప్ తోనే కూలీ సినిమాపై అటు తమిళ వారే గా కూడా తెలుగువారు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.


ఆగస్టు 14న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కూలీ మిక్స్డ్ టాక్ అందుకొని లోకేష్ కు మొదటి పరాజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. ప్రతి ఒక్క డైరెక్టర్ కెరీర్ లో విజయపజయాలు మామూలే. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడమే. ఇక కూలీ తర్వాత మొదటి నుంచి లోకేష్.. ఖైదీ 2 ను పట్టాలెక్కిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కార్తి హీరోగా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కూలీ తర్వాత ఖైదీ 2 ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు లోకేష్ అధికారికంగా కూడా చెప్పుకొచ్చాడు.


కూలీ పోయినా కూడా ఖైదీ 2 తోనైనా లోకేష్ మంచి విజయాన్ని అందుకుంటాడు అనే నమ్మకంతో అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే కూలీ ఇచ్చిన ఎఫెక్ట్ తో లోకేష్ తన ప్లాన్ ఛేంజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఖైదీ 2 ను కొన్ని రోజులు పక్కన పెట్టేసి మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి లోకేష్ సిద్ధమయ్యాడని కోలీవుడ్లో డిస్కషన్ మొదలైంది. కూలీ సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవడంతో లోకేష్ ఈసారి కమల్ హాసన్, రజనీకాంత్ తో ఒక మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమయ్యాడని సమాచారం.


ఎప్పటినుంచో కమల్, రజినీ కాంబోలో ఒక సినిమా వస్తే బాగుండు అని తమిళ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కోరికను లోకేష్ నిజం చేయనున్నాడని అంటున్నారు. వీరిద్దరికీ సెట్ అయ్యే విధంగా ఒక మంచి కథను సెట్ చేశాడని నెటిజన్స్ అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే లోకేష్ ఇండస్ట్రీ మొత్తం మరోసారి తనవైపు తిప్పుకున్నట్లే అని చెప్పొచ్చు. ఎక్కడ పోగొట్టుకున్నాడు అక్కడే మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి లోకేష్ ప్రయత్నాలు సాగిస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు .మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Anil Sunkara: ఏ హీరోతోనూ సమస్యలేదు...

Thama: ర‌ష్మిక 'త‌మా' టీజ‌ర్.. మాములుగా లేదుగా!

Updated Date - Aug 19 , 2025 | 02:49 PM