Spirit: అబ్బా.. స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన వంగా.. చాలు సామీ ఇది చాలు
ABN, Publish Date - Jul 25 , 2025 | 08:15 PM
పాన్ ఇండియా ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి.
Spirit: పాన్ ఇండియా ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగును, అనిమల్ సినిమాతో హిందీ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి నటిస్తోంది. మొదట దీపికా పదుకొనేను అనుకోగా.. ఆమె ఎక్కువ గంటలు పనిచేయను.. డబ్బులు ఎక్కువ కావాలి అని కండీషన్స్ పెట్టడంతో ఆమెను తప్పించిన వంగా.. త్రిప్తిని ఫైనల్ చేశాడు.
ఇక ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వస్తున్నా అందరి చూపు స్పిరిట్ పైనే ఉంది. సందీప్ లాంటి మాస్ డైరెక్టర్.. ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపించనున్నాడో అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్న డార్లింగ్.. దాని తరువాత స్పిరిట్ సెట్ లో అడుగుపెట్టనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ సైతం ఆగస్టు లో స్పిరిట్ పట్టాలెక్కించే పనిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మరోసర్పి స్పిరిట్ షూటింగ్ పై సందీప్ క్లారిటీ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కింగ్డమ్. జూలై 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందించిన సందీప్ సహాయం తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో హీరో - డైరెక్టర్ ఇంటర్వ్యూలు బాగా క్లిక్ అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు సందీప్.. విజయ్, గౌతమ్ ను ఇంటర్వ్యూ చేసి కింగ్డమ్ విశేషాలను బయట పెట్టించాడు.
అన్ని తనతో చెప్పించి స్పిరిట్ విషయం అడగకుండా విజయ్ ఊరుకుంటాడా.. ? స్పిరిట్ అప్డేట్ ఇవ్వమని, ఎప్పుడు మొదలవుతుందో చెప్పమని కోరాడు. సందీప్ సైతం.. స్పిరిట్ సెప్టెంబర్ చివర్లో స్పిరిట్ పట్టాలెక్కనుందని, అక్కడ నుంచి నాన్ స్టాప్ కొట్టుడే అని చెప్పుకొచ్చాడు. ఇక స్పిరిట్ అప్డేట్ చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్.. చాలు సామీ ఇది చాలు ఇంకో రెండు నెలలు సైలెంట్ గా ఉంటాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. స్పిరిట్ లో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. మొదటిసారి డార్లింగ్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ సినిమాతో డార్లింగ్ - వంగా ఎలాంటి రికార్డులను బద్దలు కొడతారో చూడాలి.
OTT Websites: అశ్లీల కంటెంట్.. ఉల్లు, ఆల్ట్, హాట్ ఎక్స్ వీఐపీ సహా 25 సైట్స్ బ్యాన్
Vishwambhara: చిరుతో మౌనిరాయ్ చిందులు