OTT Websites: అశ్లీల కంటెంట్.. ఉల్లు, ఆల్ట్, హాట్ ఎక్స్ వీఐపీ సహా 25 సైట్స్ బ్యాన్
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:46 PM
దేశంలో క్రైమ్ రేట్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం కామం. తప్పతాగి కామ వాంఛతో మగాళ్లు మృగాళ్ళుగా మారుతున్నారు.
OTT Websites: దేశంలో క్రైమ్ రేట్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం కామం. తప్పతాగి కామ వాంఛతో మగాళ్లు మృగాళ్ళుగా మారుతున్నారు. వారు అలా తయారవడానికి కారణం కొన్ని అడల్ట్ వెబ్స్ సైట్స్ (Adult Websites). అవి విచ్చలవిడిగా యాప్స్ ద్వారా.. వెబ్ సైట్ల ద్వారా ప్రసారం చేస్తున్నారు. ఎన్నిసార్లు కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఆ వెబ్ సైట్లు పద్దతి మార్చుకోకపోవడంతో ప్రభుత్వం మారినంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది.
అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేసే 25 వెబ్ సైట్లను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సైట్స్ లోబాగా పేరు తెచ్చుకున్న ఆల్ట్ బాలాజీ, ఉల్లు, హాట్ ఎక్స్ విఐపీ లాంటివి కూడా బ్యాన్ చేశారు. ఇక వీటితో పాటు.. దేశీప్లిక్స్, బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్,లుక్ ఎంటర్టైన్మెంట్, హిటైమ్, ఫినియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ ఎక్స్ వీఐపీ, హల్చల్ యాప్, మూర్ఎక్స్, నియాన్ ఎక్స్ వీఐపీ, ఫ్యుగి, మోజ్ఫెక్స్, ట్రైఫ్లిక్స్ సైట్స్ ఇక నుంచి బ్యాన్ అని తెలుస్తోంది.
Sir Madam: మరో మంచి సినిమా ఓటీటీకి బలి..
Jamie Lever: అతను వీడియో కాల్ లో బట్టలు విప్పమన్నాడు