Avinash Thiruvidhula: నందు విలన్ గా 'వానర'
ABN, Publish Date - Nov 26 , 2025 | 05:45 PM
అనీష్ తిరువీధుల హీరోగా, నటించి డైరెక్ట్ చేస్తున్న మూవీ 'వానర'. ఈ సినిమాలో నందు విలన్ గా నటిస్తుండటం విశేషం.
సోషియో ఫాంటసీ మూవీస్ ఇప్పుడు తెలుగులో ఎక్కువ అయ్యాయి. ఆబాలగోపాలాన్ని అలరించే ఇలాంటి సినిమాలతో విజయాన్ని అందుకోవడం కాస్తంత సులువు అని మేకర్స్ భావించడమే అందుకు కారణం. అలా తానే హీరోగా నటిస్తూ, అవినాశ్ తిరువీధుల (Avinash Thiruvidhula) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'వానర' (Vaanara). సిమ్రాన్ చౌదరి (Simran Choudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నందు (Nandu) విలన్ పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా (Saimadhav Burra) సంభాషణలు సమకూర్చుతున్నారు.
'వానర' చిత్రాన్ని అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. బుధవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో అవినాశ్ బైక్ పై వెళ్తుండగా, ఆయనను రక్షణగా హనుమంతుడు వెంటే వెళ్తున్న స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. 'వానర' సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను 'ఖడ్గం' పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, చమ్మక్ చంద్ర, రచ్చ రవి తదితరులు పోషిస్తున్నారు.
Also Read: Karthi : నిన్న సూర్య నేడు కార్తి... ప్లాన్ అదిరిందిగా...
Also Read: Padaharu Rojula Panduga: డి.యస్. రావు తనయుడు హీరోగా సినిమా...