Karthi : నిన్న సూర్య నేడు కార్తి... ప్లాన్ అదిరిందిగా...
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:14 PM
అన్నాదమ్ములతో అదిరిపోయే ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాడు టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. ఎలా ఒప్పించాడో తెలియదు కానీ.. అనౌన్స్ మెంట్ తో అటెన్షన్ గ్రాస్ప్ చేశాడు. అప్పుడు అన్నతో... ఇప్పుడు తమ్ముడితో సినిమాలకు రెడీ అవుతుండటమే ఆసక్తి అనుకుంటే.. దానికి ఎంచుకున్న డైరెక్టర్ హాట్ టాపిక్ గా మారాడు.
ఇండస్ట్రీలో భాషాభేదాలు దాదాపు తొలగిపోయాయి. హీరోలే కాదు.. నిర్మాతలు కూడా పరభాష హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెడుతున్నారు. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. ఈ కోవలోనే టాలీవుడ్ నుంచి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ కోలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును సెట్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
నాగవంశీ ఇప్పటికే సూర్యతో ఒక సినిమా సెట్ చేశాడు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తుండగా ఇప్పుడు సూర్య తమ్ముడు కార్తితో మరో ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడిగా ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఈ కాంబినేషన్ వినగానే టాలీవుడ్ సర్కిల్స్‌లో డిఫరెంట్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఒక వైపు ఎలా ఉంటుందా క్యూరియాసిటీ నెలకొనగా... మరోవైపు ఈ కాంబో వర్కవుట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో ‘జాతిరత్నాలు’ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ తమిళంలో శివ కార్తికేయన్‌తో ' ప్రిన్స్’ మూవీ చేసి నిరాశపరిచాడు. తెలుగు స్టైల్ కామెడీ తమిళ ఆడియెన్స్‌కి అంతగా కిక్ ఇవ్వదు. అయితే కళ్యాణ్ శంకర్ కూడా అదే జానర్ నుంచి వచ్చిన డైరెక్టర్, అంతేకాక ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాలేదని ట్రేడ్ టాక్. అలాంటి టైమ్‌లో కార్తిని కళ్యాణ్ శంకర్ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే కంటెంట్ లో కొత్త దనం ఉంటేనే కార్తి సినిమాలు చేస్తాడు. కాబట్టి, కార్తి, కళ్యాణ్ శంకర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే.. ఖచ్చితంగా సమ్ థింగ్ స్పెషల్ గా ఏదో ఉండేఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోంది.
Read Also: Champion: జంట బావుంది.. పాట అదిరింది! గిరగిర గింగిరాగిరే.. లిరికల్ వీడియో!
Read Also: Janhvi Kapoor: జాన్వీకి డూప్‌గా మరో హీరోయిన్