Shri Krishna Avatar in Mahoba: శ్రీ కృష్ణుడి దివ్యత్వం, ధీరత్వం 

ABN , Publish Date - Aug 15 , 2025 | 06:35 PM

పదకొండు -12వ శతాబ్దాల నాటి 'మహోబా' సాంస్కృతిక వైభవాన్ని, భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని సినిమాగా తెరకెక్కనుంది.

Shri Krishna Avatar in Mahoba

పదకొండు -12వ శతాబ్దాల నాటి 'మహోబా' సాంస్కృతిక వైభవాన్ని, భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని సినిమాగా తెరకెక్కనుంది. అభయ్ చరణ్ ఫౌండేషన్ , 'శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్' సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు. ముకుంద్ పాండే  (mukund Panday) దర్శకత్వం   వహిస్తున్న  ఈ చిత్రానికి  'శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా' (Shri Krishna Avatar in Mahoba) టైటిల్ ఖరారు చేశారు.  తాజాగా అధికారికంగా టైటిల్‌ను ప్రకటించారు.  ఇస్కాన్ - ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ ‘జితామిత్ర ప్రభు శ్రీ’ ఆశీస్సులతో ఈ  కావ్యం రూపొందుతోంది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇది. 'శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా' ఒక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. ప్రపంచ స్థాయి టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను కలగలుపుతుంది. నటీనటులు, సాంకేతిక బృందం మరియు ఇతర వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.

శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా వివరాలు

నిర్మాణ సంస్థలు: అభయ్ చరణ్ ఫౌండేషన్ & శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్

నిర్మాణ నిర్వహణ: అనిల్ వ్యాస్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముకుంద్ పాండే

ఆశీస్సులు: జితామిత్ర ప్రభు శ్రీ (ISKCON - ఢిల్లీ)

సినిమా నేపథ్యం: 11-12వ శతాబ్దాల నాటి మహోబా సాంస్కృతిక వైభవం మరియు శ్రీ కృష్ణుడి పాత్ర.


ALSO READ: Kasthuri Shankar: బీజేపీలో చేరిన కాంట్రవర్సీ క్వీన్

Rashmika: రశ్మిక మూవీలో నోరా, మలైకా

Sir Madam - ott: 'సార్‌ మేడమ్‌’.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

Tollywood Heroes: బాలీవుడ్ డైరెక్టర్స్ ను నమ్మడమే వీరు చేసిన తప్పా

Updated Date - Aug 15 , 2025 | 08:23 PM