Sharwanand: గుర్తుపట్టలేకుండా మారిపోయిన కుర్ర హీరో... మరీ ఇలా ఎలా
ABN, Publish Date - Oct 24 , 2025 | 07:01 PM
ఇండస్ట్రీలో లక్ ఎంత ముఖ్యమో లుక్ కూడా అంతే ముఖ్యం. హీరో అయినా హీరో అయినా వారి అందమే వారికి అవకాశాలను తీసుకొచ్చిపెడుతుంది.
Sharwanand: ఇండస్ట్రీలో లక్ ఎంత ముఖ్యమో లుక్ కూడా అంతే ముఖ్యం. హీరో అయినా హీరో అయినా వారి అందమే వారికి అవకాశాలను తీసుకొచ్చిపెడుతుంది. దాని కోసమే హీరోయిన్లు సర్జరీలు చేయించుకున్నా.. హీరోలు బాడీని పెంచినా.. తగ్గించినా. అయితే అది సినిమాకు సెట్ అవుతుంది అనుకుంటే ఓకే కానీ, మాములుగా కూడా అలాగే ఉంటే మాత్రం అభిమానులు తీసుకోలకపోతున్నారు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. సన్నగా ఏదో పేషేంట్ ఉన్నట్లు ఉన్నాడు. అలా ఎందుకు ఉన్నాడు అనేది ఎవరికీ తెలియదు. డ్రాగన్ సినిమా కోసం ఇలా మారాడని అంటున్నారు కానీ, అందులో నిజమెంత అనేది తెలియదు.
ఇక ఇప్పుడు మరో కుర్ర హీరో తన లుక్ మాత్రం మార్చేశాడు. అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. ఆ హీరో ఎవరో కాదు శర్వానంద్. ఎంతో ఆస్తి ఉన్నా కూడా తన టాలెంట్ తో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో శర్వా. సపోర్టింగ్ రోల్స్ నుంచి హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగానే నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలు శర్వా లైన్లో ఉన్నాయి.
శర్వా మొదటి నుంచి క్యారెక్టర్ కు తగ్గట్లు బాడీనీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. జాను సినిమా సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దానివలన ఈ కుర్ర హీరో బరువు పెరిగాడు. అప్పుడు శర్వాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ తరువాత నెమ్మదిగా ఒక్కో సినిమాకు తగ్గుతూ వచ్చాడు. ఇక ఈమధ్య శర్వా మరింత బక్కచిక్కి కనిపిస్తున్నాడు. మనమే సినిమాలో కూడా అలాగే కనిపించాడు. అయితే తాజాగా శర్వా తన కొత్త లుక్ లో ఫోటోషూట్ చేశాడు. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ షేక్ అవుతున్నారు. బాగా తగ్గిపోయి బక్కచిక్కి కనిపించాడు. ముఖం కూడా పూర్తిగా లోపలి పోయి.. ఏంటి ఇతను మన శర్వానా.. ఏమైంది ఇలా మారిపోయాడు అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఎంత బావుండేవాడు ఇలా ఎలా అయ్యిపోయాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
TFJA: అధ్యక్ష కార్యదర్శులుగా వై.జె. రాంబాబు, ప్రసాదం రఘు
Nagabala Suresh: టెలివిజన్ రంగానికి ఎఫ్.డి.సి. ఎండీ హామీ