TFJA: అధ్యక్ష కార్యదర్శులుగా వై.జె. రాంబాబు, ప్రసాదం రఘు

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:34 PM

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికయ్యింది. అధ్యక్ష కార్యదర్శులుగా వై.జె. రాంబాబు, ప్రసాదం రఘు ఎంపికయ్యారు.

Telugu Film Journalists Association

తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కొన్నేళ్ళుగా విశేషంగా కృషి చేస్తున్న తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) నూతన కార్యవర్గం తాజాగా ఎన్నికైంది. అధ్యక్షులుగా వై. జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదం రఘు, కోశాధికారిగా నాయుడు సురేందర్ ఎంపికయ్యారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా జె. అమర్ వంశీ, వి. ప్రేమమాలిని, సంయుక్త కార్యదర్శులుగా జీవీ, సురేష్ కొండి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా వై. రవిచంద్ర, ఎం. చంద్రశేఖర్, ఫణి కందుకూరి, డా. చల్లా భాగ్యలక్ష్మి, బి. వేణు, శివ మల్లాల, రాంబాబు పర్వతనేని, దీపక్ కోడెల, కె. సతీష్, శ్రీను దుడ్డి, సత్య పులగం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.


తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లో ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్, డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న 221 మంది సభ్యులున్నారు. వీరందరికీ ప్రతి ఏడాది హెల్త్ ఇన్యూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీలను సంస్థ అందిస్తోంది. అలానే అసోసియేట్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు హామీ ఇస్తూ పలు సహాయ కార్యక్రమాలను అసోసియేషన్ చేస్తోంది. సభ్యుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ ఏర్పాటుకు కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.

Updated Date - Oct 24 , 2025 | 06:35 PM