సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Glimpse Released: ప్రేమకు నమస్కారం అంటున్న షణ్ముఖ్

ABN, Publish Date - Sep 16 , 2025 | 01:41 PM

యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ షణ్ముఖ్ జస్వంత్ 'ప్రేమకు నమస్కారం' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఉల్కా గుప్తా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను షణ్ముఖ్ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. అలానే మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

Shanmukh Jaswanth Prema ku Namaskaaram

కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్‌ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో సెన్సేషన్‌ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్‌ సాధిస్తున్నారు. ఇటీవల 'లిటిల్‌ హార్ట్స్‌' చిత్రంతో యూట్యూబ్‌ సెన్సేషన్‌, మీమ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ మౌళి తనూజ్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. ఈ కోవలోనే యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ, ప్రముఖ నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్‌ పతాకంపై అనిల్‌ కుమార్‌ రావాడ, భార్గవ్‌ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి. భీమ శంకర్‌ దర్శకుడు. మంగళవారం హీరో షణ్ముఖ్‌ జస్వంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి 'ప్రేమకు నమస్కారం' అనే టైటిల్‌ని నిర్ణయించారని తెలియజేయడంతో పాటు ఇందుకు సంబంధించిన టైటిల్‌ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌.


ఈ గ్లింప్స్‌ వీడియోను గమనిస్తే... ఇదొక యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తోంది. లవ్‌ ఫెయిల్యూర్స్‌... లవ్‌ బ్రేకప్‌ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్‌ తమకు ఎలా హ్యాండ్‌ ఇచ్చారు అని చెప్పుకునే ఫన్నీ బాధలు అన్ని ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఇక ఫైనల్‌గా ఫణ్ముఖ్‌ ఇది పాన్‌ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్‌ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్‌తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్‌కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్‌ అవుతాయి. టోటల్‌గా 'ప్రేమకు నమస్కారం' అనే టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఈ గ్లింప్స్ విడుదల ఈ సందర్భంగా దర్శకుడు భీమ శంకర్ మాట్లాడుతూ 'ఇదొక యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో యూత్‌తో పాటు అందరికి కనెక్ట్‌ అయ్యే అంశాలున్నాయి. ముఖ్యంగా నేటి యువత లవ్‌, బ్రేకప్‌ అప్‌... ఇలా అన్ని అంశాలను పూర్తి వినోదభరితంగా చూపించబోతున్నాం. నేటి యువత బాగా కనెక్ట్‌ అయ్యే కథ ఇది' అన్నారు.

Also Read: Dokka Seethamma: డొక్కా సీతమ్మ బయోపిక్స్ వార్...

Also Read: Disha Patani Yogi Adityanath: ఎంతటి వారైనా.. వ‌దిలేది లేదు

Updated Date - Sep 16 , 2025 | 01:42 PM