సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Seven Hills Satish: మెగాఫోన్ పట్టబోతున్న యంగ్ ప్రొడ్యూసర్

ABN, Publish Date - Oct 22 , 2025 | 04:27 PM

దర్శకత్వ శాఖలో పనిచేసిన సెవన్ హిల్స్ సతీశ్, ఆ పైన మూడు చిత్రాలను నిర్మించారు. తాజాగా దర్శకుడు కావాలనే తన చిరకాల కోరికను త్వరలోనే తీర్చుకోబోతున్నట్టు సతీశ్ తెలిపారు.

Seven Hills Sateesh

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 'బట్టల రామస్వామి బయోపిక్ (Battala Ramaswamy Biopic), కాఫీ విత్ ఏ కిల్లర్ (Coffee with a Killer), సోలోబాయ్ (Solo Boy)' సినిమాలను నిర్మించిన సతీష్ (Seven Hills Satish) త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. అక్టోబర్ 23 తన పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త నిర్ణయాన్ని మీడియాకు ఆయన తెలిపారు. తన సినీ ప్రయాణం గురించి మీడియాకు వివరిస్తూ, మూడు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన తాను నిజానికి డైరెక్టర్ కావాలనే ఈ రంగానికి వచ్చానని, త్వరలోనే ఆ కోరికను నెరవేర్చుకోబోతున్నా'నని అన్నారు. అలానే తన బ్యానర్ లో మరో రెండు చిత్రాలను నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఇందులో ఒక సినిమాకు ఎడిటర్ ప్రవీణ్‌ పూడి (Praveen Pudi) దర్శకత్వం వహిస్తారని, రాజశేఖర్ గడ్డం (Rajesekhar Gaddam) దర్శకత్వం వహించే సినిమా స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పారు. నార్నె నితిన్ హీరోగా ఉగాది రోజున ప్రారంభించిన సినిమా అనుకోకుండా అనివార్య కారణాలతో పట్టాలు ఎక్కలేదని, ఆ కథను సరికొత్తగా మార్చి త్వరలోనే సినిమా చేస్తామని అన్నారు. వచ్చే యేడాది రెండు సినిమాల అప్ డేట్స్ ఇస్తామని అన్నారు.


తాను దర్శకత్వం వహించే సినిమాకు స్నేహితులు నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారని, వచ్చే యేడాది అది ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రభాస్ పుట్టిన రోజునే తన బర్త్ డే కావడం ఆనందంగా ఉందని చెప్పిన సతీశ్‌... మీడియా సమక్షంలో బుధవారం ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగిన సమావేశంలో కేక్ కట్ చేశారు. మూడు చిత్రాల నిర్మాణం సందర్భంగా ఎన్నో విషయాలను తెలుసుకున్నానని, అన్ని క్రాఫ్ట్స్ కు సంబంధించిన కొంత అవగాహన కలిగిందని అన్నారు. నార్నే నితిన్ డేట్స్ అలానే ఉన్నాయని, కథ ఓకే అయితే అతనితో సినిమాను చూస్తానని చెప్పారు. ఇవాళ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, డైరెక్ట్ గా మెసేజ్ ఇవ్వకుండా వినోదాత్మకంగా దాన్ని అందించాల్సి ఉందని, బలగం (Balagam), లిటిల్ హార్ట్స్ (Little Hearts) అలాంటి సినిమాలేనని తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొంతకాలం దర్శకత్వ శాఖలో పనిచేశానని, ఆ తర్వాత డబ్బులు సంపాదించడం కోసం రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి వెళ్ళానని అన్నారు. అక్కడ సంపాదించిన డబ్బులతోనే తిరిగి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు. ఇవాళ తెలుగు సినిమా రంగంలో ఉన్న వెంకీ అట్లూరి, సాగర్ చంద్ర, సంపత్ నంది, బలగం వేణు వంటి వారు నాకు మంచి స్నేహితులని ఆయన చెప్పారు. అలానే నందినీ రెడ్డి, మచ్చ రవి, నేచురల్ స్టార్ నానితో కూడా కలిసి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో తాను వర్క్ చేశానని తెలిపారు.

Also Read: Nara Rohith: పెళ్ళిపీటలపైకి నారా రోహిత్...

Also Read: Young Heroes: సినిమా మధ్యలో వేలు పెడతాం.. డైరెక్టర్స్ కు చుక్కలు చూపిస్తాం

Updated Date - Oct 22 , 2025 | 04:27 PM