Nara Rohith: పెళ్ళి పీటలపైకి నారా రోహిత్.. నాలుగు రోజులు వేడుక‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 03:29 PM

నారా రోహిత్, సిరి వివాహం ఈ నెల 30న హైదరాబాద్ లో జరుగబోతోంది.

Nara Rohith

హీరో నారా రోహిత్, నటి సిరి తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. తనతో పాటు 'ప్రతినిధి -2' సినిమాలో నటించిన శిరీష లెల్లాను రోహిత్ ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. గత యేడాది అక్టోబర్ 13వ తేదీ వీరి వివాహ నిశ్చితార్థం హైదరాబాద్ లోని నోవా టెల్ హోటల్ లో జరిగింది. అయితే ఆ తర్వాత నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. దాంతో వివాహ వేడుకలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు వీరి వివాహ తేదీని ఖరారు చేశారు.

nara.jpg

అక్టోబర్ 30న నారా రోహిత్, శిరీష పెళ్ళి హైదరాబాద్ లో జరుగబోతోంది. నాలుగు రోజుల పాటు పెళ్ళి వేడుకలను నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 25న హైదరాబాద్ లో హల్దీ వేడుక గ్రాండ్ గా జరుగుతుందని, 26వ తేదీన సంప్రదాయ పెళ్ళికొడుకు వేడుక చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. 28వ తేదీన మెహందీ వేడుక జరుపుతామని, 30 తేదీ రాత్రి 10.35 నిమిషాలకు అంగరంగవైభవంగా వివాహం జరుగుతుందని తెలిపారు. నారా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వేడుక ఆనందోత్సాహాల నడుమ జరుగబోతోంది. ఈ పెళ్ళి వేడుకలు స్టార్‌లతో సంతోషాలతో మెమరబుల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Suriya: సూర్యకు మరోసారి దురదృష్టం.. గోల్డెన్ ఛాన్స్ మిస్‌!

Also Read: Raviteja: టిల్లు, మ్యాడ్.. క్రాస్ ఓవర్ సినిమాకి నేను రెడీ

Updated Date - Oct 22 , 2025 | 05:19 PM