Samantha: బాయ్ ఫ్రెండ్ బిగి కౌగిలిలో సమంత.. సాహసోపేతమైన అడుగు అంటూ పోస్ట్
ABN, Publish Date - Nov 07 , 2025 | 06:46 PM
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. తెలుగులో సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. తెలుగులో సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. గత కొన్ని నెలలుగా సామ్ రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. నిర్మాత రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో సామ్ డేటింగ్ చేస్తుందని, ఇద్దరు కలిసి ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఇది నిజమే అని సామ్ ప్రతిసారి నమ్మేలా చేస్తుంది అని చెప్పోచ్చు.
ఈ మధ్య సామ్ ఎక్కడ ఉంటే రాజ్ అక్కడే ఉంటున్నాడు. ఈవెంట్స్, పబ్లిక్ పార్టీస్, వెకేషన్స్.. సామ్ ఏ పని చేసినా దాని వెనుక రాజ్ ఉంటున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజ్ పక్కన ఉన్న ఫోటోలను అప్పుడప్పుడు సామ్ నే అధికారికంగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరి ఫోటోలు ఎప్పుడు వచ్చినా కూడా అవి నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా సామ్.. రాజ్ బిగి కౌగిలిలో బంధీ అయ్యి కనిపించింది.
సామ్ ఈ మధ్యనే ఒక పెర్ఫ్యూమ్ బ్రాండ్ ను ఓపెన్ చేసిన విషయం తెల్సిందే. సీక్రెట్ అల్కమిస్ట్ అనే పేరుతో పెర్ఫ్యూమ్ బ్రాండ్ ను రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. స్టార్ హీరోయిన్స్ తో పాటు బడా బడా వ్యాపారవేత్తలు కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇక టాప్ లెస్ డ్రెస్ లో సామ్ కూడా టాప్ లేపింది. తాజాగా ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. తన కొత్త జర్నీ గురించి చెప్పుకొచ్చింది సామ్.
ఇక ఈ ఫోటోలలో హైలైట్ గా నిలిచింది సామ్- రాజ్ ఫోటో. ఒక చేత్తో విస్కీ గ్లాస్ ను పట్టుకొని.. ఇంకోచేత్తో సామ్ నడుము మీద చెయ్యి వేసి కౌగిలించుకున్న రాజ్ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ ఫోటోల గురించి సామ్ ఈ విధంగా రాసుకొచ్చింది. 'స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో.. గత ఏడాదిన్నర కాలంలో, నేను నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్ దృష్టిని విశ్వసించడం , ముందుకు ఎలా నడవాలో నేర్చుకోవడం లాంటివి చేశాను.. అలా ఈ రోజు, నేను చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసేవారిని నేను కలిశాను. అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నందుకు నేను కృతజ్ఞురాలిని. చాలా నమ్మకంతో చెప్తున్నాను ఇది ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి త్వరలో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కబురు చెప్తారేమో చూడాలి.
Aaryan Review: మర్డర్ మిస్టరీ 'ఆర్యన్' సినిమా ఎలా ఉందంటే
Sulakshana Pandit: 'సలక్షణ'నట, గాయని కన్నుమూత