సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sambarala Yeti Gattu: ఇది కూడా ఆగినట్టేనా తేజు

ABN, Publish Date - Aug 26 , 2025 | 05:24 PM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. బైక్ యాక్సిడెంట్ తరువాత విరూపాక్ష(Virupaksha) సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.

SYG Movie

Sambarala Yeti Gattu: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. బైక్ యాక్సిడెంట్ తరువాత విరూపాక్ష(Virupaksha) సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక దీని తరువాత అలాంటి విజయాన్నే అందుకోవాలని బాగా కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే తేజ్ మొదట సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ (Gaanza Shankar) అని ఒక సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ హై పేరుతో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఈ సినిమా అటకెక్కింది.


బడ్జెట్ ఎక్కువ కావడంతో మేకర్స్ చేతులు ఎత్తేశారని కొందరు.. అయితే పోలీస్ వారు టైటిల్ మార్చమనడంతో అది తనకు ఇష్టం లేక ఆ సినిమాను ఆపేసినట్లు సంపత్ నంది చెప్పుకొచ్చాడు. అయితే లోపల నిజానిజాలు ఏంటి అనేది వారికి మాత్రమే తెలుసు. ఇక గాంజా శంకర్ ఆగిపోయాక మెగా మేనల్లుడు మరో అద్బుతమైన కథతో ప్రేక్షకుల ముందకు వస్తున్నట్లు తెలిపాడు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ గుర్తింపును అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో తేజ్.. సంబరాల ఏటి గట్టు అనే సినిమాను ప్రకటించాడు.


కేపీ రోహిత్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమాలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటిస్తుండగా..జగపతి బాబు, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొదట సెప్టెంబర్ 25 న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన దసరాకు వాయిదా పడింది. దసరాకు పక్కగా రిలీజ్ చేస్తామని చెప్పిన టీమ్.. ఇంకో నెలలో దసరా వస్తున్నా ఇప్పటివరకు ఒక్క అప్డేట్ ఇచ్చింది లేదు. పోస్టర్ కానీ, లిరికల్ సాంగ్స్ కానీ, కనీసం షూటింగ్ అప్డేట్స్ కూడా ఇవ్వలేదు.


దీంతో అసలు ఏ జరుగుతుంది అని కొందరు ఆరాలు తీయగా.. ఈ సినిమా కూడా బడ్జెట్ సమస్యలను ఎదుర్కొంటుంది అనే మాట వినిపిస్తుంది. మొదట ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్ ను అనుకున్నారట. మంచి కథ, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మొత్తం కలుపుకొని అంతా బడ్జెట్ అవుతుందని లెక్కేసి మొదలుపెడితే సగం షూటింగ్ అవ్వకముందే వందకోట్ల బడ్జెట్ దాటిపోయిందని, ఇక దీంతో చేసేదేమి లేక నిర్మాత చేతులెత్తేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పోనీ మళ్లీ మొదలెట్టాలన్నా కార్మికుల సమ్మె.. పెరిగిన జీతాలు మరింత భారంగా మారడంతో సినిమాను ఆపేస్తున్నారని అంటున్నారు. మాది ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Bahubali- the Epic: రెండు పార్ట్స్ కలిపి బాహుబలి ది ఎపిక్.. టీజర్ చూశారా

Boney kapoor: శ్రీదేవి ఆస్తి కబ్జా.. కోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్‌

Updated Date - Aug 26 , 2025 | 06:20 PM