Bahubali- the Epic: రెండు పార్ట్స్ కలిపి బాహుబలి ది ఎపిక్.. టీజర్ చూశారా
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:53 PM
పాన్ ఇండియా సినిమా అనే పదాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా.. టాలీవుడ్ కు ఇంటర్నేషనల్ వేదికలపై నిలబెట్టిన సినిమా బాహుబలి (Bahubali).
Bahubali- the Epic: పాన్ ఇండియా సినిమా అనే పదాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా.. టాలీవుడ్ ను ఇంటర్నేషనల్ వేదికలపై నిలబెట్టిన సినిమా బాహుబలి (Bahubali). దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas), అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించిన చిత్రం బాహుబలి. ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. బాహుబలి – ద బిగినింగ్ సినిమా 2014న సంవత్సరం జూలై 10వ తేదీన విడుదల కాగా.. బాహుబలి - ద కంక్లూజన్ సినిమా 2017లో ఏప్రిల్ 28 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్నిఅందుకున్నాయి.
ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు కంటే రీరిలీజ్ లే ఎక్కువ కలక్షన్స్ రాబడుతున్న విషయం తెల్సిందే. అందుకే రాజమౌళి సైతం బాహుబలి సినిమాను రీరిలీజ్ చేస్తున్నాడు. అయితే కొంచెం కొత్తగా రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.అంతేకాకుండా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి కొన్ని సీన్స్ ను కూడా యాడ్ చేసి సరికొత్తగా బాహుబలిని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 31 న రీరిలీజ్ కానుంది. ఇప్పటికే రీరిలీజ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన జక్కన్న అందులో భాగంగా బాహుబలి ది ఎపిక్ టీజర్ ను రిలీజ్ చేశారు.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక నిమిషం 18 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో రెడను పార్ట్స్ లోని యాక్షన్ సీన్స్ ను కట్ చేసి వదిలారు. గూస్ బంప్స్ తెప్పించే షాట్స్ మొత్తాన్ని టీజర్ లో గుప్పించారు. పార్ట్ 1, పార్ట్ 2 లో బాహుబలి, భల్లాలదేవ, దేవసేన, అవంతిక యాక్షన్ సీన్స్ ను చూపించారు. ఇక చివర్లో ఐకానిక్ షాట్.. రాజమాత.. మహేంద్ర బాహుబలిని కాపాడేది చూపించి ఎండ్ చేశారు. ఎన్నిసార్లు చూసినా బాహుబలి ఒక అద్బుతం. ఈ టీజర్ ను చూశాక కూడా గూస్ బంప్స్ వస్తున్నాయని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసిన బాహుబలి.. ది ఎపిక్ గా రీరిలీజ్ అయ్యి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Coolie: దాన్ని దాటాకపోతే తమిళ్ లో కూడా కూలీ ప్లాపే
Allu Arjun: హాలీవుడ్ స్థాయి కోసం.. బన్నీ ప్లాన్ మాములుగా లేదుగా..