Boney kapoor: శ్రీదేవి ఆస్తి కబ్జా.. కోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్‌

ABN , Publish Date - Aug 26 , 2025 | 05:52 PM

దివంగత నటి శ్రీదేవి (Sri devi)ఆస్తిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారంటూ బోనీ కపూర్‌ (Boney kapoor) కోర్టును ఆశ్రయించారు.

దివంగత నటి శ్రీదేవి (Sri devi)ఆస్తిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారంటూ బోనీ కపూర్‌ (Boney kapoor) కోర్టును ఆశ్రయించారు. చట్టవిరుద్థంగా హక్కులను సొంతం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. శ్రీదేవి ఎంతో కష్టపడి ఆ ఆస్తి కొనుగోలు చేసిందని ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ వివరాలను కోర్టుకు వివరించారు బోనీ కపూర్‌. 1988 ఏప్రిల్‌లో శ్రీదేవి మద్రాసులో మొదలియార్‌ అనే వ్యక్తి వద్ద స్థిరాస్తి కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే ఆమె దాన్ని కొనుగోలు చేసిందని బోనీ కపూర్‌ తెలిపారు. మొదలియార్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వారందరి దగ్గర వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాతనే శ్రీదేవి ఈ ఆస్తిని సొంతం చేసుకున్నట్లు బోనీ కపూర్‌ పేర్కొన్నారు. (Property issue)

‘ఎంసీ సంబంద మొదలియార్‌ రెండో భార్య కుమారులు ఈ ఆస్తిలో వారికి వాటా ఉందంటూ తహశీల్దార్‌ కార్యాలయంలో అప్పీల్‌ చేశారు. ప్రభుత్వ అధికారులు నిర్ణయంతో తాజాగా చట్టవిరుద్ధంగా దీని హక్కులు సొంతం చేసుకున్నారు. శ్రీదేవి బతికుండగానే మొదలియార్‌ రెండో వివాహం చేసుకున్నారు.  మోసపూరితమైన పత్రాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని  కోర్టును ఆశ్రయించాను. ఈ కేసును విచారించిన జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ నాలుగు వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని.. ద్రువీకరణ పత్రం ఇచ్చిన తాంబరం తాలుకా తహసీల్దార్‌ను ఆదేశించారు.

 

Updated Date - Aug 26 , 2025 | 06:01 PM