Divvela Madhuri: పొట్టు పొట్టున కొట్టుకున్న రీతూ - మాధురి..
ABN, Publish Date - Oct 27 , 2025 | 09:50 PM
బిగ్ బాస్ సీజన్ 9 (Biggboss Telugu 9) లో ఏం నడుస్తుందో.. ఏమో ఎవరికి అర్ధం కావడం లేదు. ఇప్పటివరకు జరిగిన 8 సీజన్స్ అన్నింటిలో వరస్ట్ సీజన్ అంటే సీజన్ 9 అనే చెప్పుకొస్తారు.
Divvela Madhuri: బిగ్ బాస్ సీజన్ 9 (Biggboss Telugu 9) లో ఏం నడుస్తుందో.. ఏమో ఎవరికి అర్ధం కావడం లేదు. ఇప్పటివరకు జరిగిన 8 సీజన్స్ అన్నింటిలో వరస్ట్ సీజన్ అంటే సీజన్ 9 అనే చెప్పుకొస్తారు. అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో.. దానిని నాగార్జున ఎందుకు ఆపడం లేదో.. ఎవరికి తెలియదు. సైలెంట్ గా ఎవరి గేమ్ వారు ఆడకుండా.. 3 నెలలు ఉండే ఇంట్లో బాండింగ్స్ అని కొందరు.. ఫేక్ రిలేషన్స్ అని ఇంకొందరు .. స్ట్రాటజీ అని మరికొందరు గేమ్ ఆడుతున్నామని అనుకుంటున్నారు. ఇక వాటిని పాయింట్స్ గా చూపించి నామినేషన్స్ చేయడం ప్రతి వారం ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది.
చపాతీ ఇవ్వలేదని, కర్రీ సరిపోలేదని, ఆ అమ్మాయి ఈ అబ్బాయితో మాట్లాడిందని, ఈ అమ్మాయి, ఇంకో అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసిందని నామినేషన్.. ఒక స్ట్రాంగ్ పాయింట్ తో నామినేట్ చేసుకునే కంటెస్టెంట్ నే లేరు అంటే అతిశయోక్తి లేదు, అందుకే ఈసారి బిగ్ బాస్.. బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ను మళ్లీ పిలిపించి వారితో నామినేట్ చేయించాడు. వారు చెప్పి పాయింట్స్ వ్యాలిడ్ అయినా కూడా హౌస్ లో ఉన్నవారు తీసుకోలేకపోతున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే దివ్వెల మాధురి హౌస్ కి వెళ్లినప్పటి నుంచి హౌస్ నిజంగానే రణరంగంగా మారింది. ఆమెకు ఒక మంచి లేదు. మర్యాద లేదు. ఏయ్.. ఏంటి.. నోరు మూసుకో.. అది ఇది అని ఎదుటివాళ్లను పనిమనుషులు కన్నా హీనంగా చూస్తుంది.
బాండింగ్స్ పెట్టుకుంటున్నారు అని రీతూ - పవన్ ని నామినేట్ చేసిన మాధురి.. ఇంట్లోకి వెళ్లగానే తనూజతో బాండింగ్ ఏర్పరుచుకుంది. అది బయటకు చెప్పిందని రీతూను ప్రతి వారం నామినేట్ చేస్తూ వచ్చింది. ఇక నేటి నామినేషన్స్ లో మాధురి - రీతూ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. బాండింగ్ ఉండడం వలనే డబ్బులు ఇచ్చావని.. నమ్మించి మోసం చేసావని అంటే.. బాండింగ్ లు ఎవరికి లేవు.. ఇక్కడ ఉన్నవారందరికీ ఉన్నాయి. మీకు, తనూజకు బాండింగ్ లేదా.. ఆమెకు సపోర్ట్ చేయడానికి బిగ్ బాస్ కు వచ్చావా అని రీతూ అడగ్గా.. అందుకు మాధురి అవన్నీ హెల్దీ బాండింగ్స్ .. రీతూ - పవన్ డి అన్ హెల్దీ బాండింగ్ అని చెప్పుకొచ్చింది. దానికి రెచ్చిపోయిన రీతూ.. మీకెలా తెలుసు.. ఎలా అంటారు అలా అని మండిపడింది. దానికి తాను రోజు చూస్తున్నాను అని మాధురి సమాధానం ఇచ్చింది. ఇక మాధురి మాటలు విన్నవారు.. అవునవును హెల్దీ బాండింగ్స్ గురించి ఈవిడే మాట్లాడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Save Film Chamber: సేవ్ ఫిల్మ్ ఛాంబర్ అంటూ కొవ్వొత్తుల ర్యాలీ..
Mass Jathara Trailer: ఇక్కడ సంజీవిని లేదు.. ఆంజనేయుడు రాడు.. ట్రైలర్ అదిరిపోయిందంతే