Save Film Chamber: సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అంటూ కొవ్వొత్తుల ర్యాలీ..

ABN , Publish Date - Oct 27 , 2025 | 08:42 PM

ఫిల్మ్‌ఛాంబర్‌ (Film Chamber) ఎన్నికలు వాయిదా, దాని వెనకున్న కారణాలుపై ఇండస్ట్రీలో పెద్ద రచ్చే నడుస్తోంది.

ఫిల్మ్‌ఛాంబర్‌ (Film Chamber) ఎన్నికలు వాయిదా, దాని వెనకున్న కారణాలుపై ఇండస్ట్రీలో పెద్ద రచ్చే నడుస్తోంది. దీనికి తోడు ఫిల్మ్‌ ఛాంబర్‌ బిల్డింగ్‌ను ప్రైవేట్‌ వ్యక్తుల చేతికి డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలనే ఆలోచనలో కొందరు ఉన్నారనే విషయంపై కూడా చర్చ నడుస్తోంది. దీనిపై టాలీవుడ్‌ నిర్మాతలు కొందరు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆవరణలో ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ బ్రింగ్‌ బ్యాక్‌ ది గ్లోరీ’ అంటూ కొవ్వొత్తుల (Telugu Film Chamber) ర్యాలీ చేశారు. మురళీ మోహన్‌,   సురేష్‌ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్‌, అశోక్‌ కుమార్‌, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్‌ రెడ్డి,  నరసింహారావు,  శివనాగేశ్వరరావు , చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. మురళీ మోహన్‌ మాట్లాడుతూ ‘తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌ రావడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థలాలు కేటియించింది. సినిమా పరిశ్రమకు సంబంధించిన కార్యాలయాలన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ స్థలం ఇచ్చారు. ఇందులో ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్మాణం జరిగింది. అందులోనే ఇప్పటికీ పలు శాఖల ఆఫీసులు నడుస్తున్నాయి. ఇది కట్టి నలభై ఏళ్లు అవుతుంది. దీనిని చిత్ర పరిశ్రమకు సంబంధించి వాటికి తప్ప వేరే వాటికి ఉపయోగించకూడదు. ఎవరికో డెవలప్‌మెంట్‌ ఇచ్చి అందులో మూడు వంఉతలు షేర్‌ వాళ్లకి ఇచ్చి మనకు 25 శాతం మనకు మిగలడం తగదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాటిపై ఒక అవగాహన వచ్చాకే కొత్త బిల్డింగ్స్‌ గురించి ఆలోచించవచ్చు. ఇక్కడున్న ప్రతి అంగుళం పూర్తిగా సినిమా పరిశ్రమకే ఉపయోగపడాలి.  ఇంకేదో చేస్తానంటే కుదరదు’ అని అన్నారు.   

అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమ స్థిరపడటం కోసం ఇక్కడ ఫిలిం చాంబర్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కొక్కటిగా ఇండస్ట్రీ  కోసం నిర్మాతల సౌకర్యాల కోసం, అనేక ఆఫీసులు ఈ క్లాంప్లెక్స్‌ లో ఏర్పాట్లు అయ్యాయి. అప్పట్లో అందరూ కలిసి తలో చేయి వేసి ఈ బిల్డింగ్ కట్టారు. ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడడానికి ఈ బిల్డింగ్ కారణం. ఒకవేళ అభివృద్దికి ఇస్తే పూర్తిగా చిత్రపరిశ్రమకే ఈ స్థలం ఉపయోగపడాలి.  ఫిలిం ఛాంబర్‌ అభివృద్ధిపై సినీ పెద్దలు అందరూ కలిసికట్టుగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉమ్మడి నిర్ణయం తీసుకుకోవాలి’ అన్నారు.   

Updated Date - Oct 27 , 2025 | 09:16 PM