సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jai Hanuman: ఎట్టకేలకు సెట్‌ మీదకు.. ‘జై హనుమాన్‌’

ABN, Publish Date - Nov 18 , 2025 | 12:53 PM

తేజా సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన ‘హనుమాన్‌’ ఎంతటవవి ఘన విజయం సాధించిందో తెలిసిందే! దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ (jai Hanuman) చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్‌.


తేజా సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన ‘హనుమాన్‌’ ఎంతటవవి ఘన విజయం సాధించిందో తెలిసిందే! దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ (jai Hanuman) చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్‌. ఇందులో ప్రధాన పాత్రలో  కన్నడ స్టార్‌ నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) పోషించనున్నారు. ఈ సినిమాను అనౌన్స్‌ చేసి చాలా కాలమే అయింది. దీనికి సంబంధించి రిషబ్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే రిషబ్‌ బిజీగా ఉండటం, డేట్స్‌ కుదరక ఈ సినిమా ఇంకా సెట్స్‌ మీదకి వెళ్లలేదని టాక్‌. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పట్టాలెక్కేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రిషబ్‌ వరుసగా ఐదారు నెలలు ప్రశాంత్‌ వర్మకి కాల్షీట్స్‌ ఇచ్చినట్లు చిత్ర బృందం నుంచి సమాచారం అందింది. ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తే అవుతుంది.

అయితే ఈ సినిమా డిలే అవ్వడానికి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, ఫ్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నిరంజన్‌ రెడ్డితో ఉన్న విభేదాలు, ఆర్థిక లావాదేవీలు కూడా ఓ కారణమని తెలుస్తుంది. అయితే దర్శకనిర్మాతలు ఇద్దరు ఆ రచ్చను ఫిల్మ్‌ఛాంబర్‌లో పెట్టారు. వారే ఇష్యూకి సొల్యూషన్‌ ఇస్తారని దర్శకుడు ఇటీవల ఓ లేఖ ద్వారా తెలిపారు.

ALSO READ: NBK 111-Nayanatara: సామ్రాజ్యంలోకి రాణికి స్వాగతం.. నయన్‌ లుక్‌ అదిరింది..

Bose Venkat: నటీనటులను హేళన చేయడం భావ్యం కాదు

Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న.. వారణాసి బ్యూటీ

Ram Pothineni: భాగ్యశ్రీతో ప్రేమ.. అదేంటి రామ్ అంత మాట అన్నాడు

Updated Date - Nov 18 , 2025 | 01:58 PM