Mass Jathara: వింటేజ్ రవితేజను గుర్తు చేసే.. 'హుడియో హుడియో'

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:41 PM

మాస్ మహరాజ్ రవితేజ తాజా చిత్రం 'మాస్ జాతర' అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా థర్డ్ సింగిల్ 'హుడియో... హుడియో'ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Mass Maharaj Raviteja Mass Jathara

'మాస్ జాతర' (Mass Jathara) చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా మేకర్స్ థర్డ్ సాంగ్ 'హుడియో హుడియో'ను రిలీజ్ చేశారు. మాస్ అండ్ మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ ట్యూన్, అందరినీ కట్టిపడేసేలా ఉంది. విశాఖపట్నం నుండి కిరండూల్ రైలు ప్రయాణం నేపథ్యంలో ఈ పాట సాగడం విశేషం. ఆ మార్గంలోని కొండకోనల అందాలను అద్భుతంగా కాప్చర్ చేశారు. పచ్చని పొలాల నడుమ, గూడెం దారులలో మాస్ మహరాజ్ రవితేజ (Raviteja), అందాల భామ శ్రీలీల (Sreeleela)తో శేఖర్ మాస్టర్ (Shekhar Master) హృద్యమైన స్టెప్టులు వేయించారు. వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరింది. అక్కడక్కడా వింటేజ్ రవితేజ దర్శనమిచ్చాడు. దేవ్ పవార్ (Dev Pawar) రాసిన పాట సాధారణంగా అనిపించినా... నచ్చిన అమ్మాయి మెచ్చే విధంగా ప్రియుడు వాగ్దానాలు చేయడం సరదాగా ఉంది. పాట చిత్రీకరణలో ఓ ఆర్గానిక్ మూమెంట్ కనిపించింది.

MJ-Song STILL1.jpg


'హుడియో... హుడియో' అనే హుక్ లైన్ తో సాగిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచాడు. అతనే పాడాడు... చిత్రం ఏమంటే మరో సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాటకు తానూ భీమ్స్ తో గొంతు కలిపాడు. దాంతో ఒక కొత్త అనుభూతిని శ్రోతలకు అందించినట్టు అయ్యింది. 'ముద్దు పెడతా, ముద్ద పెడతా... జోల పాడతా, పిల్లలకు పాలుపడతా' అంటూ ముగించడంతో ఓ పరిపూర్ణత్వం చేకూరింది.

MJ-Song STILL2.jpg

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందు విడుదలైన రెండు పాటలతో పాటు ఈ పాట కూడా సినిమా పట్ల ఆసక్తిని పెంచేలా ఉంది. మరి మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ రూపుదిద్దుకున్న 'మాస్ జాతర' అక్టోబర్ 31న ఏ రీతిన ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Also Read: Kantara Chapter1: అప్పుడు పుష్ప‌.. ఇప్పుడు కాంతార అగ‌ర‌బ‌త్తీలు

Also Read: Malluwood: వాహన అక్రమ రవాణా కేసుల్లో హీరోలు...

Updated Date - Oct 08 , 2025 | 01:46 PM