Mass Jathara: మాస్ జాతర వాయిదా.. ఆ ప్లాపులే కారణమా
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:50 PM
మాస్ మహారాజా రవితేజ (Raviteja), శ్రీలీల (Sreeleela) జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర(Mass Jathara).
Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Raviteja), శ్రీలీల (Sreeleela) జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర(Mass Jathara). సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమా రిలీజ్ కు పట్టుమని పది రోజులు కూడా లేదు.. ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది లేదు. మొదటి నుంచి ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.
ఇక మొదట్లో మాస్ జాతర రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించక పోవడంతో వాయిదా పడుతుంది అనుకున్నారు. కానీ, సూర్యదేవర నాగవంశీ మాత్రం మాస్ జాతర ఎక్కడా తగ్గేదిలేదు కచ్చితంగా ఆగస్టులోనే వస్తుంది అని ఆగస్టు 27న రిలీజ్ కానుందని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే మొన్నటివరకు టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతూ వచ్చారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర వాయిదా పడిందని తెలుస్తోంది. నాగవంశీ గత కొన్ని సినిమాలుగా ప్లాపులను అందుకుంటున్న విషయం తెల్సిందే. ఈమధ్య వచ్చిన కింగ్డమ్ ఎంతటి నష్టాన్ని చవిచూసిందో అందరికీ తెల్సిందే.
కింగ్డమ్ తరువాత వార్ 2 తెలుగు రైట్స్ ను కూడా నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేశాడు. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇలా నాగవంశీకి దెబ్బమీద దెబ్బ పడుతూ వచ్చింది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు మాస్ జాతర విషయంలో వెనకడుగు వేస్తున్నారని అందుకే కొద్దిగా గ్యాప్ తీసుకొని రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా మరోసారి వాయిదా పడితే మాత్రం చిక్కులు తప్పవు అని టాక్ నడుస్తోంది. ఆగస్టు పోతే.. సెప్టెంబర్ మొత్తం పెద్ద పెద్ద సినిమాలతో ప్యాక్ అయ్యి ఉంది. అక్టోబర్ లో కాంతార, ఇడ్లీ కడై ఉన్నాయి. మరి వీటి మధ్యలో మాస్ జాతర ఎప్పుడు వస్తుందో చూడాలి.
Dear Students Teaser: నయన్ మరో కొత్త ప్రయోగం.. డియర్ స్టూడెంట్స్ టీజర్ అదిరింది
NTR: ఏంటీ.. ఎన్టీఆర్ సీరియల్ లో కూడా నటించాడా.. అది కూడా ఆ పాత్రలో