Kantara Chapter1: అప్పుడు పుష్ప‌.. ఇప్పుడు కాంతార అగ‌ర‌బ‌త్తీలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:23 PM

తుళునాడు ప్రాంతంలోని ఆధ్యా త్మిక సంప్రదాయాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన‌ క‌న్న‌డ చిత్రం కాంతార చాప్టర్-1.

Kantara Chapter 1

తుళునాడు ప్రాంతంలోని ఆధ్యా త్మిక సంప్రదాయాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన‌ క‌న్న‌డ చిత్రం కాంతార చాప్టర్-1 (Kantara Chapter1). ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా దేశవిదేశాలలో బాక్సాఫీస్ వ‌ద్ద సంచలనం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్పుడు అదే కాంతార పేరుతోనే సైకిల్ ప్యూర్ ఆగరబ‌త్తి (Cycle Pure Agarbatti)లు మార్కెట్ లోకి విడుదల చేసింది.

ఈ సంద‌ర్భంగా హొంబాళ (Hombale Films) గ్రూప్ కోఫౌండర్, ఎండీ చలువేగౌడ మాట్లాడుతూ.. రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం చేయ‌డంతో పాటు నటించిన కాంతార ముఖ చిత్రంతోనే బ్రాండ్ విడుదల చేయడం సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. కాంతార సినిమా క‌న్న‌డ‌, తులు ప్ర‌జ‌ల‌ నమ్మకం, సంప్రదాయాలను ప్ర‌పంచానికి చూపిందని, మన ఆధ్యాత్మిక మూలాలను పరిచయం చేసిందన్నారు.

kantara

సైకిల్ ప్యూర్ ఎండీ అర్జున్ రంగా మాట్లాడుతూ కాంతార కేవలం సినిమాగా మాత్రమే కాకుండా మన పురాతన సంప్రదాయల సంబరం చేసుకునే శక్తిగా అవతరించిందన్నారు. కేఆర్ సిద్ధార్థ మాట్లాడుతూ కాంతార పేరుతో (Parampara Three in One Kantara: Ch 1 Movie Exclusive Edition) రెండు బ్రాండ్ల అగరబత్తిలు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఇదిలాఉంటే.. గ‌తంలో మంగ‌ళ్‌దీప్ అగ‌ర‌బ‌త్తీస్ ఇలానే అల్లు అర్జున్ పుష్ప‌2 ముఖ‌ చిత్రంతో ప్ర‌త్యేక ఆగరబ‌త్తిలను మార్కెట్ లోకి విడుదల చేయ‌డం విశేషం.

pushpa

Updated Date - Oct 08 , 2025 | 12:23 PM