NBK: బాలకృష్ణకు మరో గౌరవం.. తొలి దక్షిణాది నటుడు

ABN , Publish Date - Sep 08 , 2025 | 06:32 PM

నందమూరి బాలకృష్ణ ఖాతాలో మరో రికార్డు చేరింది.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఖాతాలో మరో రికార్డు చేరింది. ముంబయిలోని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. అధికారుల ఆహ్వానం మేరకు ఎన్‌ఎస్‌ఈని బాలకృష్ణ సందర్శించారు. అక్కడి సిబ్బంది  విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన గంట (NSE Bell)ను మోగించారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్  అవుతున్నాయి.  ఆయనకు దక్కిన గౌరవంపై  అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాలయ్యకు  ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కిన సంగతి తెలిసిందే.

NBK.jpg

ప్రస్తుతం ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్సకత్వంలో ‘అఖండ 2: తాండవం’ రూపొందుతోంది. ఈ  పాన్‌ ఇండియా చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మేనన్‌ కథానాయిక. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.  దసరాకు రావాల్సిన ఈ సినిమా డిసెంబరు (akhanda 2 release date) తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Sep 08 , 2025 | 06:42 PM