Pawan- Ramana Gogula: అప్పుడు వెంకీ... ఇప్పుడు పవన్ వంతు
ABN , Publish Date - Sep 08 , 2025 | 06:24 PM
కొన్ని కాంబినేషన్ల గురించి ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. వారు చేసిన పనులే చెప్పాల్సినంత చెప్తుంటాయి. అలాంటిదే ఆ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ల కాంబినేషన్.. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తుండటంతో ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల (Ramana Gogula) కాంబో తెలుగు ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'తమ్ముడు' (Thammudu) , 'బద్రి' (Badri) , 'జానీ' (Johnny), 'అన్నవరం' (Annavaram) లాంటి సినిమాలతో ఈ ఐకానిక్ జోడీ ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించింది. రాను రాను రమణ గోగుల వేరే వర్క్ తో బిజీ అవడంతో... ఆయన గొంతును, మ్యూజిక్ ను వినిపించే అవకాశం రాలేదు. ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) సినిమాలో 'గోదారి గట్టు' (Godari Gattu) అనే పాటతో రీ-ఎంట్రీ ఇచ్చి, మళ్లీ పాత రోజులను గుర్తు చేశారు. ఈ క్రమంలో పవర్ స్టార్, రమణగోగుల కలిసి పని చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమాలో రమణ గోగుల ఓ సాంగ్ పాడబోతున్నాడు. దీంతో విషయం తెలిసి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వీరి మ్యూజిక్ మేజిక్ చేస్తుందని సంతోషంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే మ్యూజిక్ అల్బమ్ గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
రీసెంట్ గా 'సైమా అవార్డ్స్' ఈవెంట్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మ్యూజిక్ అల్బమ్ గురించి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad ) తాజాగా బాగా హైప్ చేశాడు. అంతేకాక పవన్ కళ్యాణ్ డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో హైలైట్ అవుతాయని కూడా చెప్పాడు. పైగా ఇటీవల సినిమాలోని ఓ డాన్స్ నంబర్ నుంచి పవన్ స్టైలిష్ పోజ్‌లో కనిపించిన స్టిల్ కూడా వైరల్ అయ్యింది. డీఎస్పీ మ్యూజిక్, రమణ గోగుల వాయిస్... పవన్ ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ కలిస్తే..' గబ్బర్ సింగ్' సాంగ్స్ లాంటి బ్లాక్‌బస్టర్ వైబ్ థియేటర్స్‌లో రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.
Read Also: Teja Sajja: అన్నీ కష్టాలే.. ఓ పెద్ద వ్యక్తే నమ్మించి మోసం చేశాడు..
Read Also: Mirai: శ్రియాకు అచ్చివచ్చిన సెప్టెంబర్...