Ravi Basur: ఎన్టీఆర్‌-నీల్‌ సినిమా.. రవి బసూర్ సీక్రెట్స్‌

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:14 PM

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంపై సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంపై సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కేజీఎఫ్‌, సలార్‌లకు మించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘కేజీఎఫ్‌, సలార్‌ తర్వాత ప్రశాంత్‌నీల్‌తో కలిసి వర్క్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది. ప్రశాంత్‌నీల్‌తో నా బాండింగ్‌ ఎంతో స్పెషల్‌. మేం తక్కువ మాట్లాడుకుంటాం.. ఎక్కువ వర్క్‌ చేస్తాం ఎన్టీఆర్‌తో నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం విజువల్స్‌తోపాటు సంగీతం కూడా భారీ స్థాయిలో ఉండబోతుంది. ఇందులో ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశారు. ప్రశాంత్‌నీల్‌ తీసిన కేజీఎఫ్‌, సలార్‌ కంటే మ్యూజిక్‌ చాలా భిన్నంగా ఉండబోతుంది. దీని కోసం కొత్త ఇన్‌స్ట్రూమెంట్‌ ఉపయోగిస్తున్నాం. అందరూ ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తారు’ అని అన్నారు. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో వార్‌-2 చిత్రంలో నటించారు. ఆ చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. ఆ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. రుక్మిణీ వసంత్‌ కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ALSO READ: అమితాబ్, చిరంజీవి.. న‌ట గురువు క‌న్నుమూత‌

Tollywood: నటుడు జోష్ రవి ఇంట తీవ్ర విషాదం

Meera Vasudevan: మూడో భర్తకూ విడాకులిచ్చిన హీరోయిన్..

Ram Pothineni: భాగ్యశ్రీతో ప్రేమ.. అదేంటి రామ్ అంత మాట అన్నాడు

Updated Date - Nov 18 , 2025 | 12:29 PM