RGV: దావుద్ ఇబ్రహీం కూడా నా గురువే అంటున్న ఆర్జీవీ
ABN, Publish Date - Sep 05 , 2025 | 04:49 PM
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురికి నచ్చినది.. ఆయనకు నచ్చదు.
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలుగురికి నచ్చినది.. ఆయనకు నచ్చదు.కొంతమంది బతికితే ఆయనలా బతకాలి అంటారు.. ఇంకొంతమంది అది కూడా ఒక బతుకేనా అని అంటారు. ఎవరు ఎన్ని అనుకున్నా వర్మ మాత్రం తాను ఎలా బతకాలి అనుకుంటాడో అలాగే జీవిస్తున్నాడు. ఒకప్పుడు సోషల్ మీడియాలో వర్మ చేసే పోస్టులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఎవరి మీద కౌంటర్ వేస్తున్నాడో.. ఎవరి గురించి ఏం రాస్తున్నాడో అని చాలా క్యూరియాసిటీగా నెటిజన్స్ ఎదురుచూసేవారు.
అయితే కొన్ని నెలలుగా వర్మ సైలెంట్ గా ఉంటున్నాడు. దానికి కారణాలు ఏమైనా కావొచ్చు కానీ, నెటిజన్స్ మాత్రం వర్మ పోస్టులను మిస్ అవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ పోస్టులు విషయం పక్కన పెడితే.. ప్రతి పండగకు వర్మ విషెస్ చెప్పే విధానమే వేరు. ఈరోజు టీచర్స్ డే అన్న విషయం అందరికీ తెల్సిందే. తమకు పాఠాలు నేర్పిన గురువులకు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక వర్మ కూడా తన జీవితంలో ఎదగడానికి సహాయపడిన గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు.
ఆ గురువుల్లో మోస్ట్ వాంటెంట్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నట్లు తెలిపాడు. 'నేను ఇలా మారడానికి, అలాంటి సినిమాలు తీయడానికి నాకు స్ఫూర్తిగా నిలిచిన అందరు గొప్పవారికి పెద్ద సెల్యూట్. అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, బ్రూస్ లీ, శ్రీదేవి, దావూద్ ఇబ్రహీం లాంటి వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు' అంటూ చెప్పుకొచ్చాడు, ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్
Ghaati Review: అనుష్క నటించిన యాక్షన్ డ్రామా 'ఘాటీ' మెప్పించిందా