Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్

ABN, Publish Date - Sep 05 , 2025 | 03:40 PM

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 1/17

Onam Celebrations: తెలుగువారికి సంక్రాంతి ఎంత పెద్ద పండగో.. కేరళలో ఓనమ్ అంత పెద్ద పండగ. ఈ పండగను కేరళలో ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. ఇక మలయాళీ భామల చీరకట్టులోనే ఓనమ్ పండగ మొత్తం ఉంటుంది. నేడు ఓనమ్ పండగ కావడంతో మల్లు హీరోయిన్స్ అందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం రండి.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 2/17

ఆకాశం నీ హద్దురా సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న అపర్ణ బాలమురళీ.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 3/17

కల్కి సినిమాతో తెలుగువారికి సుపరిచితమైన ముద్దుగుమ్మ అన్నా బెన్.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 4/17

మ్యాడ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారి.. ఈ ఏడాది 8 వసంతాలు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అనంతిక సనీల్ కుమార్.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 5/17

మేడ మీద అబ్బాయి, గాయత్రీ సినిమాలతో తెలుగుతెరకు పరిచయమైన భామ నిఖిల విమల్. గురువాయూర్ అంబలనాదయిల్, పోరు తొజిల్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయింది.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 6/17

గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగువారిని మెప్పించిన బ్యూటీ మిర్నలిని రవి.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 7/17

ఈ మధ్యనే కొత్త లోక సినిమాలో మొట్టమొదటి ఫీమేల్ సూపర్ హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణి ప్రియదర్శిని.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 8/17

టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నభా నటేష్.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 9/17

జైలర్ లో రజినీకాంత్ కోడలిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న మిర్న మీనన్. తెలుగులో ఉగ్రం, నా సామీ రంగా సినిమాల్లో కూడా నటించింది.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 10/17

ప్రేమమ్ సినిమాతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన బ్యూటీ మడోన్నా సెబాస్టియన్. శ్యామ్ సింగరాయ్ లో కీలక పాత్రలో నటించింది.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 11/17

అందాల హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజాసాబ్ సినిమాతో ఈ చిన్నది తెలుగుతెరకు పరిచయం కాబోతుంది.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 12/17

96 సినిమాతో చిన్నప్పటి జానుగా నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారింది గౌరీ జి కిషన్. తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 13/17

అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. సార్, విరూపాక్ష సినిమాలతో తెలుగు కుర్రాళ్లకు క్రష్ గా మారింది.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 14/17

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 15/17

దాదా సినిమాతో మంచి హిట్ అందుకున్న అపర్ణ దాస్ ఆదికేశవ, బీస్ట్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యింది.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 16/17

లిటిల్ థింగ్స్ అనే సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్నది మిథిలా పాల్కర్.. తెలుగులో విశ్వక్ సేన్ సరసన ఓరి దేవుడా సినిమాలో నటించి మెప్పించింది.

Onam Celebrations: ఓనమ్ పండగ.. చీరల్లో మెరిసిపోతున్న హీరోయిన్స్ 17/17

బాలనటిగా అనికా సురేంద్రన్ కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మారింది. తెలుగు బుట్టబొమ్మ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Updated at - Sep 05 , 2025 | 03:45 PM